సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాది పొడుగునా స్కిన్‌ని సూర్యుని నుంచి వచ్చే కిరణాల నుంచి కాపాడుకునేందుకు సన్ స్క్రీన్ లోషన్లు రాస్తూ ఉంటాం. అసలు సన్ స్క్రీన్ లోషన్లు ఎందుకు వాడలి? వీటి వాడకం వల్ల ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 


Also Read: Kidney Stones: మీ కిడ్నీలో రాళ్లు ఉన్నాయా? ఈ ఇంటి చిట్కాలతో రాళ్లను తరిమికొట్టండి... ఆరోగ్యంగా ఉండండి



* సూర్య కిరణాల నుంచి మన శరీరానికి విటమిన్ D అందుతుంది. అలాగే ఆ కిరణాలు మనకి హాని కలిగించకుండా కూడా చూసుకోవాలి. సన్ స్క్రీన్ అప్లై చేయడం వల్ల ఈ కిరణాలు చర్మం లోపలికి చొచ్చుకుని వెళ్ళి హాని కలిగించకుండా కాపాడుతుంది. 


* వయస్సు ఎక్కువైనా యవ్వనంగా కనిపించాలి అని అందరూ అనుకుంటారు. దీని కోసం ఎప్పుడూ మెరుపు, ఆరోగ్యంగా ఉండే స్కిన్ కావాలి అనుకుంటారు. చర్మాన్ని బట్టి మనకు సూటయ్యే సన్ స్క్రీన్ రాసుకోవడం వల్ల స్కిన్ యూత్‌ఫుల్ గా కనిపిస్తుంది. ముడతలు రావు.


 * సన్ స్క్రీన్ ట్యానింగ్ కలుగకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తుంది.


Also Read: Moringa Leaves: మునగాకు ఔషధాల గని... ఆహారంలో భాగం చేసుకోండి... అద్భుత ప్రయోజనాలు పొందండి


* సన్ స్క్రీన్‌ని ప్రతి రెండు గంటలకి ఒకసారి అప్లై చేయాలి. మీరు స్ప్రే సన్ స్క్రీన్ యూజ్ చేసినా, చెమట బాగా పట్టినా, ఈత కొట్టినా గంట, గంటన్నరకే మళ్ళీ అప్లై చేసుకోవాలి.


*సన్ స్క్రీన్ క్రీమ్ అయినా సన్ స్క్రీన్ లోషన్ అయినా తప్పకుండా కెమికల్స్ అనేది ఉపయోగిస్తారు. వీటి వల్ల చర్మానికి కొన్ని రియాక్షన్స్ వస్తాయని నిపుణులు అంటున్నారు. ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఉపయోగించడం వల్ల ముఖంపై ఇరిటేషన్ లేదా చర్మం ఎరుపెక్కడం లాంటి సమస్యలు వస్తాయి. 


Also Read: Drinking Water: నిలబడి నీళ్లు తాగుతున్నారా? అయితే... ఆ అలవాటు మానుకోండి... మరి, మంచి నీళ్లు ఎలా తాగాలి?


* అలర్జీలు, సున్నితమైన చర్మం ఉన్నవారు ఆల్కహాల్ కలిగిన లోషన్లు వాడకపోవడం ఉత్తమం. అలాగే చిన్నారులకు డై ఆక్సీబెంజాన్ ఉండే సన్‌స్క్రీన్ లోషన్లు వాడకూడదు.


* సున్నిత చర్మం కలిగిన వాళ్లు చర్మ వైద్యుల సూచన మేరకు 50 ప్లస్‌ సన్‌స్ర్కీన్‌ లోషన్స్‌ వాడాలి. జిడ్డు చర్మం ఉన్నవాళ్లు మాయిశ్చరైజర్ లేని లోషన్లు ఎంచుకోవాలి. పొడి చర్మం ఉన్నవారు మాత్రం మాయిశ్చరైజర్ కలిగిన సన్‌స్క్రీన్ లోషన్లు వాడొచ్చు.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.