ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2021 తేదీలను ప్రకటించింది. అక్టోబర్ 7 నుంచి 12 వరకు 'బిగ్ బిలియన్ సేల్' మొదలవుతుందని తెలిపింది. దసరా, దీపావళి సందర్భంగా ప్రత్యేక రాయితీలపై ఉత్పత్తులు కొనుగోలు చేయొచ్చని వెల్లడించింది. గృహ అవసరాలు, గ్యాడ్జెట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర వస్తువులను తక్కువ ధరలకే పొందొచ్చని వెల్లడించింది.
Also Read: Online Payment: మీరు ఆన్‌లైన్ పేమెంట్స్ చేస్తారా? త్వరలో కొత్త రూల్ ఇదే..
'మీ అవసరాలు తీర్చేందుకు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2021 అతి త్వరలో రాబోతోంది. స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, టీవీలు, వాషింగ్ మెషిన్లు సహా అనేక ఉత్పత్తులు బిగ్‌బిలియన్ డేస్ విక్రయాల్లో అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాల వస్తువులపై మీరు భారీ రాయితీలు ఆశించొచ్చు. మీ కొనుగోలు జాబితాను సంతృప్తికరంగా ముగించొచ్చు' అని ఫ్లిప్‌కార్ట్ కొన్నిరోజుల క్రితం వెబ్‌సైట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తేదీలను మాత్రం మంగళవారం వెల్లడించింది.
Also Read: Flying Car : మేడిన్ చెన్నై బ్రాండ్ ఎగిరే కారు ! రిలీజ్ ఎప్పుడు అంటే...?
ప్రస్తుతం ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకులతో ఫ్లిప్‌కార్ట్ ఒప్పందం కుదుర్చుకొంది. ఆ బ్యాంకుల వినియోగదారులు వస్తువలు కొనుగోలుపై అదనపు రాయితీలు పొందొచ్చని తెలిపింది. పేటీఎం ద్వారా షాపింగ్ చేసేవారికీ రాయితీలు లభిస్తాయని వెల్లడించింది.
ఆఫర్లు ఇవే..
బాట్ సంస్థ ఉత్పత్తులపై 80 శాతం వరకు రాయితీ లభించనుంది. స్మార్ట్ వాచ్లపై 70 శాతం వరకు డిస్కౌట్ వస్తుందని తెలిసింది. డిజో ఉత్పత్తులపై 60, ఇంటెల్ ల్యాప్‌టాప్లపై 40 శాతం వరకు రాయితీలు రానున్నాయి.
అంతేకాకుండా ఇతర బ్రాండ్‌ల ల్యాప్‌టాపులు, స్మార్ట్ వేరబుల్స్, హెడ్‌ఫోన్లు, స్పీకర్లపై 80 శాతం వరకు రాయితీలు లభిస్తాయి. రిఫ్రిజరేటర్లపై 70శాతం వరకు డిస్కౌట్లు ఉంటాయని తెలిసింది. ఇక ఫ్లిప్‌కార్టులో లభించే ప్రతి వస్తువలపై కనీసం 50-70 శాతం వరకు రాయితీలు లభిస్తాయి. సామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్లు, ఒప్పో ఉత్పత్తులు, వివో స్మార్ట్‌ఫోన్లు, ఐఫోన్ 12 సిరీస్‌లపై ప్రత్యేక డిస్కౌంట్లు ఇవ్వనున్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి