ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక అంశాలపై వట్టి మాటలే చెబుతున్నారని చేతల్లోకి రావడం లేదని ప్రజలు తనతో చెబుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన పలు అంశాలపై ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారని వాటిని వివరించారు. పరిషత్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రికలో వచ్చిన ఓ హెడ్‌లైన్‌ను ప్రస్తావించిన రఘురామ .. అంటే ఇక నుంచి ఎలాంటి హామీలు అమలు చేయాల్సిన అవసరం లేదా అని సందేహం వ్యక్తం చేశారు. Also Read : ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే ! రోడ్డున పడుతున్న రాజమండ్రి వైఎస్ఆర్‌సీపీ రాజకీయం !


ఇప్పటి వరకూ జగన్ పాలకు ప్రజలు మద్దతిచ్చారని.. నిర్ణయాలన్నింటికీ మద్దతిచ్చినట్లుగా భావిస్తున్నారని అందుకే ఇక సీపీఎస్ రద్దు , జీతాల పెంపు సహా పెండింగ్‌లో ఉన్న అనేక హామీలను నేరవేర్చాల్సిన అవసరం లేదన్నట్లుగా భావిస్తున్నట్లున్నారని ఓ పాత్రికేయుడు పంపిన ప్రశ్నలను మీడియా సమావేశంలో  రఘురామరాజు చదివి వినిపించారు. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఊరకనే వచ్చి  సీఎం జగన్‌తో సమావేశం అయి ఉండరని.. ముఖ్యమైన అంశాలే మాట్లాడి ఉంటారని ఆయన అన్నారు. అయితే వైసీపీ ఎంపీలు ఇతర పార్టీల వారిని కలవాలంటే ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాలని ఆంక్షలు పెట్టారని మరి సుబ్రహ్మణ్య స్వామి ఇలా బీజేపీ హైకమాండ్ వద్ద పర్మిషన్ తీసుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. Also Read : వైఎస్‌ఆర్‌సీపీ పంతం - టీడీపీ నిర్లక్ష్యం ! కుప్పంలో కదిలిన చంద్రబాబు పునాదులు !


ఇక రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా - రాజమండ్రి ఎంపీ భరత్‌ల మధ్య ఏర్పడిన వివాదంపై కూడా స్పందించారు. అయితే వారి మధ్య ఏర్పడిన రాజకీయ వివాదం కన్నా.. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఫిర్యాదులపై విచారణ జరగాలని రఘురామరాజు అన్నారు. ముఖ్యంగా అవ భూముల కుంభకోణం విషయంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ముఖ్యమంత్రి జగన్‌కు లెక్కలతో సహా లేఖలు రాసినా విచారణ జరిపించలేదన్నారు. ఎప్పుడో ఆరేళ్ల కిందట అవినీతి జరిగిందంటూ ఫైబర్ నెట్ కేసులో ఇప్పుడు అరెస్టులు చేస్తున్నారని.. మరి మన ప్రభుతవంలోనే అవినీతి జరిగిందని సొంత ఎమ్మెల్యే ఆధారాలు ఇస్తే ఎందుకు విచారణ చేయించలేదని ఆయన ప్రశ్నించారు. పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అందరికీ తెలుసని.. ప్రజలు కూడా అనుకుంటున్నారని విచారణ జరిపితే నిజాయితీ ఉంటుందన్నారు.Also Read : రూ.9వేల కోట్ల హెరాయిన్ వెనుక అసలు కథేంటి ? కింగ్ పిన్ ఎవరో ఎలా తేలుతుంది ?
 
ఇక దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించిన డ్రగ్స్ కేసు విషయం చాలా సీరియస్ ఇష్యూ అని .. అయితే విజయవాడ పోలీస్ కమిషనర్ అసలు దర్యాప్తు పూర్తి కాక ముందే ఏపీకి అసలు సంబంధంలేదని ప్రకటించడం ఏమిటన్నారు. ఇలా ప్రకటించడం వల్లనే ప్రజల్లో ఎక్కువ అనుమానాలు వస్తాయని గుర్తు చేశారు.  ఇక ప్రభుత్వం సినిమా టిక్కెట్లు అమ్మాలన్న నిర్ణయంపైనా మరోసారి విమర్శలు గుప్పించారు. ఆర్థిక నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన సీఎఫ్ఎంఎస్ విధానాన్నే ప్రభుత్వం సక్రమంగా నిర్వహించలేకపోతోందని.. ఇక సినిమా టిక్కెట్ల పోర్టల్‌ను ఎలా నిర్వహిస్తుందని ప్రశ్నించారు. ఇప్పటికీ పెద్ద సినిమాలు తప్ప.. ఇతర సినిమాలకు ఎక్కువగా ఆఫ్ లైన్ టిక్కెట్లే అమ్మడవుతూ ఉంటాయని రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. మఖ్యమంత్రి రోడ్ల గురించి.. సంక్షేమం గురించి ఆలోచించాలి కానీ సినిమ టిక్కెట్ల అమ్మకం కాదని ఆయన వ్యాఖ్యానించారు. Also Read : మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పూర్తిగా కోలుకున్న సాయి ధరమ్ తేజ్.. వెంటిలేటర్ తొలగింపు


మద్యనిషేధానికి జాతీయ స్థాయి విధానం తేవాలన్న మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణరెడ్డి వ్యాఖ్యలపై రఘురామరాజు మండిపడ్డారు. మద్యనిషేధం చేస్తాననిచెప్పింది రాష్ట్రంలో అయితే కేంద్రం పాలసీ చేయమంటారేమిటని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు ఇలా మాటలు చెబితే ఛీ కొడతారన్నారు. Also Read : బీజేపీకి మజ్లిస్ మిత్రపక్షమా ? శత్రుపక్షమా ? ఎందుకు ఓట్లు చీల్చి సహకరిస్తోంది ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.