ఎగిరే కారు సినిమాల్లోనే చూసి ఉంటారు. మూడు నెలల కిందట స్లోవేకియా ఇలాంటి ఓ కారును ట్రయల్ రన్ నిర్వహించిన అంశం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అయితే ఇప్పుడు ఇండియాలోనూ అలాంటి ఎగిరే కార్లు రెడీ అవబోతున్నాయి. దీనికి సంబంధించి ముందడుగు పడింది. కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాధిత్య సింధియా ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. చెన్నైకి చెందిన వినాతా ఏరో మొబిలిటి అనే సంస్థ ఆసియా మొట్ట మొదటి హైబ్రీడ్ ఫ్లైయింగ్ కార్‌ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. ఈ కారు కాన్సెప్ట్‌తో తయారు చేసిన చిన్న కారును తీసుకెళ్లి సింధియాకు చూపించారు. వీటిని చూసి ముచ్చటపడిన కేంద్రమంత్రి ఫోటోలు తీసి ట్విట్టర్‌లో పెట్టారు.




వి.ఏ. ఏరో మొబిలిటి సంస్థ స్టార్టప్‌లాగా పని చేయడం ప్రారంభించింది. వినూత్న ఆలోచనలతో కూడిన యువ బృందం కంపెనీని డీల్ చేస్తోంది. ఒక్క సారి ఈ ఎగిరే కారు కాన్సెప్ట్‌ను సిద్ధం చేసిన తర్వాత భారత రవాణా రంగంలో సంచలనాత్మకమైన మార్పులు వస్తాయని కేంద్రమంత్రి సంతోషపడ్డారు. ఒక్క ప్రయాణికులనే కాకుండా నిత్యావసరాలు, మందులు సహా ముఖ్యమైన వాటినన్నింటినీ సులువుగా రవాణా చేయవచ్చునని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వి.ఏ. ఏరో మొబిలిటి సంస్థ బృందాన్ని అభినందించాు. డ్రోన్ రివల్యూషన్ ప్రారంభమయిందన్నారు.


Also Read : ఒకే కాండానికి 839 టమాటాలు... గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు


ఇటీవలి కాలంలో డ్రోన్ల స్థాయిను వాహనాల స్థాయికి పెంచేందుకు ప్రపంచవ్యాప్తంగా యువ పరిశోథకులు ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రోన్ల సామర్థ్యం అంతకంతకూ పెరుగుతోంది. అన్ని రంగాల్లోనూ ఉపయోగిస్తున్నారు. ఇటీవల ఇండియాలోనూ డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ల సరఫరా ప్రారంభించారు. ఇలాంటి సమయంలో చెన్నైకు చెందిన వీ.ఏ. మొబిలిటి సంస్థ ఏకంగా ఏగిరే కార్ తయారీకి రంగం సిద్దం చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.


Also Read : ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే ! రోడ్డున పడుతున్న రాజమండ్రి వైఎస్ఆర్‌సీపీ రాజకీయం !


ప్రపంచంలో ఇప్పటి వరకూ ఎగిరే కారును ఒక్క సంస్థే రూపొందించింది. స్లొవేకియాకు చెందిన  స్టీఫెన్‌ క్లిన్‌ దీని రూపకల్త. గత జూలైలో ఎగిరే కారు ట్రయల్‌ రన్‌ విజయవంతంగా పూర్తయింది.  దాదాపు 8 వేల ఎత్తుకు ఎగిరి..  విమానాశ్రయంలో ల్యాండ్‌ అయ్యింది. 2.15 నిమిషాల్లోనే విమానంగా మారిపోయే ఈ కారు.. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది. ఒకసారి ఇంధనం నింపుకుంటే వెయ్యి కిలోమీటర్ల దూరం వెళ్లగలదు. ఈ వాహనంలో ఇద్దరు వ్యక్తులు ప్రయాణించగలరు. ఈ కారుకు పోటీగా చెన్నై కుర్రాళ్లు ఎగిరే కారును రెడీ చేయబోతున్నారు.


Also Read : బీజేపీకి మజ్లిస్ మిత్రపక్షమా ? శత్రుపక్షమా ? ఎందుకు ఓట్లు చీల్చి సహకరిస్తోంది ?


 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి