ఈ మధ్య కాలంలో మునగాకు చేసే మేలు మరే ఇతర ఆకు కూరలు చేయవని తరచూ వార్తల్లో చదువుతూనే ఉన్నాం. ఇంతకీ మీరు మునగాకును మీ ఆహారంలో భాగం చేసుకున్నారా లేదా?. మునగాకును ఆరోగ్యానికే కాదు అందం కోసం ఉపయోగిస్తారు. మునగాకు వాడటం వల్ల ఏం ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం. 


పాలిచ్చే తల్లుల కోసం: పసిబిడ్డలకు పాలిచ్చే తల్లులు మునగాకును ఏదో ఒక రూపంలో అంటే పొడి, పప్పు రూపంలో తీసుకుంటే పాలు ఎక్కువగా తయారవుతాయి. దీంతో మీ బిడ్డ కడుపు నిండుతుంది. 


Also Read: White Hair Tips: తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారా? ఈ టిప్స్ ట్రై చేయండి



పోషకాల గని: మునగాకులో పోషకాలు, ఖనిజాలు, ఫైబర్ ఉంటాయి. చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. 



రక్తపోటును తగ్గిస్తుంది: మునగాకు జ్యూస్‌కి రక్తపోటును తగ్గించే గుణం ఉంది. దీంట్లో ఉండే ఫ్లేవానాయిడ్లు ఇందుకు కారణం. 


* పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగించడంలో దీని తర్వాతే ఏదైనా.
* చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మునగాకు సాటిలేదు. 
* రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో, రక్తంలో చక్కెర, కొవ్వులను నియంత్రించి.. గుండె పని తీరు మెరుగు పరచడంలో ఇది బాగా పని చేస్తుంది. 


Also Read: Drinking Water: నిలబడి నీళ్లు తాగుతున్నారా? అయితే... ఆ అలవాటు మానుకోండి... మరి, మంచి నీళ్లు ఎలా తాగాలి?



* అలెర్జీ, ఆస్తమా, శ్వాస కోశ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాన్సర్ కణాలతో పోరాడి ముఖ్యంగా గర్భాశయ ముఖ ద్వార, అండాశయ కాన్సర్లను నిరోధిస్తుంది. 
* మెదడును కూడా చురుకుగా ఉంచుతుంది. శరీరంలో నీటి సాంద్రతను సమస్థితిలో ఉంచుతుంది మునగాకు. 


* ఒక కప్పు మునగాకు తీసుకుని మెత్తగా నూరి రసం తీసుకోవాలి. దూది సాయంతో ఈ రసాన్ని ముఖానికి, మెడకు పట్టించాలి. ప్రతి రోజూ రాత్రి నిద్ర పోయే ముందు ఇలా చేసి తెల్లవారి లేవగానే గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకుంటే మంచిది. నల్లటి మచ్చలు, మొటిమలు, ముడతలు పోయి చర్మాన్ని యవ్వనంగా, కాంతి వంతంగా మార్చుతుంది. 


Also Read: Thyroid Problems: థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? థైరాయిడ్ నియంత్రణ ఆహారాలు, ఏ ఆసనం ద్వారా థైరాయిడ్‌ను అదుపుచేయొచ్చు?



* ఒక స్పూన్ మునగ పువ్వుల రసాన్ని ఒక గ్లాసు మజ్జిగలో కలిపి తాగితే ఉబ్బసం, అజీర్తి నుంచి ఉపశమనం పొందవచ్చు. 
* మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారు కొబ్బరి నీటిలో ఒక చెంచా మునగ పువ్వుల రసాన్ని కలిపి తాగితే మంచి ఫలితాలు కలుగుతాయి. 


Also Read: Immune Boosting Juices: ఇమ్యూనిటీ పవర్ పెంచే జ్యూసులు ఇవే... మరి మీరు రోజూ తీసుకుంటున్నారా?