రోగ నిరోధ‌క శ‌క్తి (Immunity Power) ఈ మధ్య కాలంలో తరచూ వినిపిస్తోన్న మాట. కోవిడ్ మహమ్మారి నుంచి తప్పించుకోవాలన్న, వచ్చిన తర్వాత తట్టుకోవాలన్నా మనకు రోగ నిరోధక శక్తి ఎంతో అవసరం. అంతేకాదు జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రం ఇలాంటి చిన్న చిన్న అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలన్నా మనకు ఇమ్యూనిటీ పవర్ అవసరం. ఇమ్యూనిటీ ప‌వ‌ర్ దెబ్బ‌తింటే శ‌రీరం నీర‌సిస్తుంది. అనేక ర‌కాల ఆరోగ్య స‌మ‌స్య‌లు ఎద‌ర‌వుతాయి. మ‌రి, రోగ నిరోధ‌క శ‌క్తిని ఎలా పెంచుకోవాలి? ఏ జ్యూసులు తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుందో ఇప్పుడు చూద్దాం. 


Also Read: Benefits of Eating Fish: చేపలు తరచూ తింటున్నారా? వారానికి 2 లేదా 3 సార్లైనా తింటే ఎంతో మంచిదట


ట‌మాటా జ్యూస్
ట‌మాటాల్లో విట‌మిన్ సీ, ఈ, బీటా కెరోటిన్ పుష్క‌లంగా ల‌భిస్తుంది. ఈ పోష‌కాలు రోగ నిరోధ‌క శ‌క్తిని త‌గ్గించే ఫ్రీ రాడిక‌ల్స్‌ను అడ్డుకుంటాయి. రోజూ ట‌మాటా జ్యూస్ తాగ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెర‌గ‌డ‌మే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు జ‌రుగుతుంది.


యాపిల్ జ్యూస్
‌రోగ నిరోధ‌క శ‌క్తిని పెంపొదించుకోవ‌డంలో యాపిల్ జ్యూస్ కూడా ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. యాపిల్‌లో విట‌మిన్ ఏ, బీ1 బీ2, బీ6, సీ విట‌మిన్ల‌తో పాటు ఫోలిక్ యాసిడ్‌, నియాసిన్‌, జింక్‌, పొటాషియం వంటి ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచ‌డంతో పాటు న‌రాల వ్య‌వస్థ‌ను బ‌లోపేతం చేస్తాయి.


Also Read: Bottle Feeding: మీ చిన్నారికి డబ్బాతో పాలు పడుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?


పుచ్చ‌కాయ జ్యూస్
‌నీటి శాతం ఎక్కువ‌గా ఉండే పుచ్చ‌కాయ రోగ నిర‌ధ‌క శ‌క్తిని పెంచుతుంది. అంతేకాకుండా ఏవైనా ఇన్‌ఫెక్ష‌న్ల బారిన ప‌డిన‌ప్పుడు క‌లిగే కండ‌రాల నొప్పిని త‌గ్గిస్తుంది. పుచ్చ‌కాయ‌లోని గింజ‌లు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కాబట్టి గింజలు తీసేయ‌కుండానే జ్యూస్ చేసుకుని తాగ‌డం మంచిది.


బీట్‌రూట్‌ జ్యూస్
‌బీట్‌రూట్లో విట‌మిన్ సీ, కాల్షియం, ఐర‌న్ కూడా పుష్క‌లంగా ల‌భిస్తుంది. కాబ‌ట్టి ర‌క్త‌హీన‌త‌తో బాధ‌ప‌డేవారు బీట్‌రూట్ జ్యూస్ తాగ‌డం ఎంతో మంచిది. బీట్‌రూట్‌లో ల‌భించే లైకోపిన్, ఆంథోసైయ‌నిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి.


Also Read: Jasmine Benefits: తలనొప్పితో బాధపడుతున్నారా? మల్లెపూలను పక్కన పెట్టుకుని నిద్రపోండి



సిట్ర‌స్ పండ్ల జ్యూస్
‌నిమ్మ‌, నారింజ‌, ద్రాక్ష‌ వంటి సిట్ర‌స్ పండ్ల‌లో విట‌మిన్ సీ పుష్క‌లంగా ఉంటుంది. ఇన్ఫెక్ష‌న్ల‌ను త‌గ్గించ‌డంలో విట‌మిన్ సీ స‌మర్థ‌వంతంగా ప‌నిచేస్తుంది. సిట్ర‌స్ పండ్ల జ్యూస్‌లు తాగ‌డం వ‌ల్ల‌ వ్యాధి నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. 


క్యారెట్ జ్యూస్
‌క్యారెట్ల‌లో విట‌మిన్ ఏ, బీ1, బీ2, బీ3, నియాసిన్‌, ఫోలెట్‌, కాల్షియం, పొటాషియం, మెగ్నిషియం వంటి పోష‌కాల‌తో పాటు పీచు పుష్క‌లంగా ఉంటుంది. క్యారెట్ జ్యూస్‌లోని బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది.