వీలైనంత వరకు బిడ్డకు తల్లి పాలే పట్టాలి. కానీ, కొన్ని కారణాల వల్ల కొందరు తల్లులకు పాలు పడకపోవడం వల్ల పోత పాలు ఇస్తారు. డబ్బాతో పట్టే ఈ పోత పాలు చిన్నారులకు అంత మంచివి కాదని అంటున్నారు వైద్యులు. సీసాతో పాలు పట్టే తల్లులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి కోసమే ఈ జాగ్రత్తలు.
Also Read: Jasmine Benefits: తలనొప్పితో బాధపడుతున్నారా? మల్లెపూలను పక్కన పెట్టుకుని నిద్రపోండి
* ముందుగా సీసాను, పాల పీకను సబ్బు నీళ్లతో శుభ్రంగా కడగాలి. ఆవు, గేదె, మేక వంటి పాడి పశువుల పాలు ఇవ్వవచ్చు. ఆవు పాలల్లో కాల్షియమ్, సోడియం అధికంగా ఉంటాయి. ఇవి చిన్న బిడ్డ కిడ్నీ మీద ప్రభావం చూపే ప్రమాదముంది.
* పాల బాటిల్ కనీసం 10 నిమిషాల పాటు మరిగే నీళ్లలో ఉంచాలి. అలాగే పాల పీకను కనీసం 2 నుంచి 4 నిమిషాల పాటు వేడి నీళ్లలో మరగనివ్వాలి. పాలు పట్టే సీసాలు జాగ్రత్తగా స్టెరిలైజ్ చేసి వాడాలి.
* పాల సీసాతో బిడ్డకు పాలు తాగించే సమయంలో ఒకసారి తాగాక మిగిలిన పాలను పారబోయాలి.
* బిడ్డ నిద్రపోయే సమయంలో పాలు తాగించకూడదు. పాలు నీళ్లూ సమంగా కలపాలి. డాక్టర్ సలహాతో బిడ్డకు ఏ పాలు మంచివో నిర్ణయించుకుని వాడాలి.
* బిడ్డను ఒళ్లో పడుకోబెట్టి పాలు ఇవ్వాలి. పాలు పట్టాక బిడ్డను వెంటనే పడుకోబెట్టకూడదు.
* పాలు పట్టగానే బిడ్డను మొదట భుజంపై వేసుకుని నెమ్మదిగా వీపు పై తట్టాలి. ఇలా తేన్పు వచ్చే వరకు తట్టాలి.
డబ్బా పాలు తాగించడం వలన పిల్లలు రోజుకు మిలయన్ల కొద్ది మైక్రో ప్లాస్టిక్‌ను మింగేస్తున్నారని ఓ పరిశోధనలో తేలింది. ప్రపంచంలో చాలా వరకు బాటిల్స్‌ను పాలీ ప్రోపైలీన్ పాస్టిక్‌తో తయారు చేసినవే అందుబాటులో ఉన్నాయి. ఆహారానికి సంబంధించి వాడే ప్లాస్టిక్‌లో 82 శాతం ఈ రకానికి సంబంధించినవే.
12 నెలల వయస్సు గల చిన్నారులపై మైక్రో ప్లాస్టిక్స్ ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి అనే విషయంపై పరిశోధన కోసం 48 దేశాల్లోని చిన్నారులను పరిశీలించారు. మైక్రోప్లాస్టిక్స్ పిల్లల శరీరంలోకి విషపూరిత కెమికల్స్ చేర్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి ప్లాస్టిక్ వాడకుండా ఉండేందుకు జాగ్రత్త లు తీసుకోవడమే మంచిది.