మన శ‌రీరానికి B9 విటమిన్ ఎంతో అవసరం. దీన్నే ఫోలిక్ యాసిడ్, ఫోలేట్ అని పిలుస్తారు. ఈ విట‌మిన్ లోపిస్తే ఎప్పుడూ నీర‌సంగా ఉంటారు. కొంచెం పని చేసినా బాగా అలిసిపోతాం. గుండె వేగంగా కొట్టుకుంటుంది. శ్వాస తీసుకోవ‌డంలో కూడా సమస్యలు తలెత్తుతాయి. త‌ల‌నొప్పి, ఏకాగ్రత లోపించ‌డం వంటి ఇత‌ర స‌మస్యలు కూడా వ‌స్తాయి. ఫోలిక్ యాసిడ్ గ‌ర్భిణుల‌కు ఎంతో అవ‌స‌రం. ఎవ‌రైనా స‌రే... ఫోలిక్ యాసిడ్ లభించే ఆహారాల‌ను తరచూ తీసుకోవాలి. 


Also Read: Cancers: వారానికి 150 నిమిషాలు వ్యాయామం చేస్తే... క్యాన్సర్ల ముప్పు నుంచి కాస్త తప్పించుకోవచ్చు


క్యాన్సర్‌ రాకుండా, డీఎన్ఏ మార్పులు జ‌ర‌గ‌కుండా చూసేందుకు కూడా ఫోలిక్ యాసిడ్ అవ‌స‌రం అవుతుంది. హైబీపీ రాకుండా ఉండేందుకు, ర‌క్తహీనత స‌మ‌స్య త‌గ్గేందుకు కూడా మ‌న‌కు ఫోలిక్ యాసిడ్ అవ‌స‌రం. క‌డుపులో ఉన్న బిడ్డ స‌రిగ్గా ఎద‌గాలంటే ఫోలిక్ యాసిడ్ ఉన్న ఆహారాల‌ను గ‌ర్భిణులు ఎక్కువ‌గా తినాలి. పుట్టబోయే పిల్లల్లో మెద‌డు, వెన్నెముక స‌మ‌స్యలు రాకుండా ఉండాలంటే గ‌ర్భిణులు ఫోలిక్ యాసిడ్ ఉండే ఆహారాన్ని రోజూ తీసుకోవాలి. అందుకే డాక్టర్లు కూడా గ‌ర్భిణుల‌కు ఫోలిక్ యాసిడ్ మందుల‌ను రాస్తుంటారు. ఫోలిక్ యాసిడ్ మ‌న శ‌రీరంలో నూత‌న క‌ణాల‌ను త‌యారు చేయ‌డంలో, వాటికి పోష‌ణ అందించ‌డంలో ఉప‌యోగ‌ప‌డుతుంది. 


Also Read: Coffee During Pregnancy: గర్భవతులు కాఫీ తాగొచ్చా? తాగితే ఏమవుతుంది? పుట్టబోయే బిడ్డకు ఎంత ప్రమాదమో తెలుసా?


* పాల‌కూర‌, బ్రొకోలి, బీన్స్‌, ప‌చ్చి బ‌ఠానీలు, ప‌ప్పు దినుసులు, నిమ్మకాయలు, అర‌టి పండ్లు, పుచ్చకాయలు, తృణ ధాన్యాల్లో మ‌న‌కు ఫోలిక్ యాసిడ్ ఎక్కువ‌గా ల‌భిస్తుంది.
* ఫోలిక్‌యాసిడ్‌ లెవెల్స్‌ పెరగాలంటే పాలకూర, సోయాను డైట్‌లో చేర్చండి. వీటిని ఒక కప్పు తీసుకున్నట్లయితే శరీరానికి కావాల్సిన ఫోలిక్‌ యాసిడ్‌ అందుతుంది.
* బీన్స్‌, బఠాణీలో ఫోలిక్‌ యాసిడ్‌ అధిక శాతం ఉంటుంది. అంతేకాకుండా చిన్న కప్పు కాయధాన్యాలను తీసుకున్న తగినంత ఫోలిక్‌ యాసిడ్‌ లభిస్తుంది.
* ఒక కప్పు అవకాడో తీసుకుంటే రోజూ తీసుకోవాల్సిన ఫోలిక్‌ యాసిడ్‌లో 22 శాతం లభిస్తుంది. అంతేకాకుండా విటమిన్‌ ఎ, కె, ఫైబర్‌ పుష్కలంగా లభిస్తాయి.
* గుమ్మడికాయ విత్తనాలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, వేరుశెనగలు తీసుకున్నా తగినంత ఫోలిక్‌ యాసిడ్‌ అందుతుంది. డ్రైఫూట్స్‌ తిన్నా ఫలితం ఉంటుంది.


Also Read: Chicken Soup: నాన్ వెజ్ లవర్స్ కోసం... చికెన్ సూప్ ఎలా తయారు చేసుకోవాలి? వర్షాకాలంలో చికెన్ సూప్ తీసుకోవడం మంచిదేనా?



* దుంపల్లో యాంటీ ఆక్సిడెంట్లు, డిటాక్సిఫికేషన్‌ ఎలిమెంట్లు ఉంటాయి. ఒక కప్పు దుంపలు తీసుకుంటే ఒక రోజు తీసుకోవాల్సిన ఫోలిక్‌యాసిడ్‌లో 34 శాతం అందుతుంది. 
* ఆరెంజ్‌, బొప్పాయి, అరటిపండ్లు, గ్రేప్స్‌, స్ట్రాబెర్రీ వంటి పండ్లలో ఫోలిక్‌ యాసిడ్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది.
* బెండకాయ జీర్ణశక్తిని పెంచుతుంది. ఒక కప్పు బెండ తీసుకుంటే 37 మైక్రోగ్రాముల ఫోలిక్‌ యాసిడ్‌ లభిస్తుంది.
* కార్న్‌లో ఫోలేట్‌ అధికంగా ఉంటుంది. ఒకకప్పు ఉడికించిన కార్న్‌ తీసుకుంటే రోజు తీసుకోవాల్సిన ఫోలిక్‌ యాసిడ్‌లో 20 శాతం అందుతుంది. 
* క్యారెట్‌ను ఏ రూపంలో తీసుకున్నా మంచిదే. ఒక కప్పు క్యారెట్‌ జ్యూస్‌  రోజూ తీసుకోవాల్సిన ఫోలిక్‌యాసిడ్‌లో 5 శాతాన్ని అందిస్తుంది.