గర్భవతులు కాఫీ తాగొచ్చా లేదా అనేది ఎంతో మందికి ఉన్న సందేహం. గర్భవతులే కాదు ఎవరైనా సరే కాఫీ, టీలు మోతాదులో తీసుకుంటే నష్టం లేదు. కానీ, మోతాదు మించితే మాత్రం ముప్పు తప్పదు అంటున్నారు వైద్యులు. 


Also Read: Fitness Tips: మీ పిల్లలతో రోజూ వ్యాయామం చేయిస్తే... చదువులో రాణిస్తారు


ఉద్యోగాలు చేసేవాళ్లు, సాయంత్రం సరదాగా కాసేపు స్నేహితులతో బయటికి వెళ్లినప్పుడు కాఫీ, టీ తీసేసుకుంటాం. అంతేకాదు ఇంట్లో ఉంటే... ఉదయం, సాయంత్రం కూడా పుచ్చుకుంటాం. టీ, కాఫీలు జీవితంలో భాగం అయిపోయాయి. రోజూ ఓ కప్పు, రెండు కప్పులు తీసుకుంటే ముప్పేమీ లేదు కానీ ఆ పైన తాగితే మాత్రం లేని రోగాలను తెచ్చుకునే వారవుతారు. 


గర్భవతులు కాఫీలు తాగితే వచ్చే ప్రమాదం ఏంటి?


 గర్భధారణ (pregnancy) సమయంలో కాఫీ తాగడం మంచిది కాదు. కాఫీలో ఉండే కెఫిన్ శాతం మీ శరీరంలోని రక్త ప్రసరణపై ప్రభావం చూపుతోంది. దీని వల్ల కడుపులో పెరుగుతున్న పిండానికి రక్తం సరఫరాలో హెచ్చుతగ్గులు జరుగుతాయి. రోజుకి 200mg కెఫిన్ వరకు గర్భవతులు తీసుకోవచ్చు. అంటే... రెండు మగ్గుల ఇన్‌‌స్టాంట్ కాఫీ లేదా ఒక మగ్గు ఫిల్టర్ కాఫీ. 


Also Read: Hair Fall Solutions: కరోనా వచ్చి తగ్గాక జట్టు రాలుతోందా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి


అలాకాకుండా గర్భవతులు ప్రతి రోజూ 200mg కంటే ఎక్కువ కెఫిన్ తీసుకుంటే పుట్టబోయే బిడ్డకు ప్రమాదం. అంతేకాదు బిడ్డ తక్కువ బరువులో పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ బిడ్డ తక్కువ బరువుతో పుడితే ఆరోగ్య సమస్యల బారిన పడతారు. ఒక్కోసారి ప్రెగ్నెస్సీ పోయే ప్రమాదం కూడా ఉంటుంది. 




ప్రత్యేకంగా కొన్ని వ్యాధులు ఉన్నవారు కాఫీని అస్సలు తాగకూడదు. మీరు మైగ్రేన్ సమస్యతో బాధపడుతుంటే .. అస్సలు కాఫీ తాగొద్దు. కాఫీలో కెఫిన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది మెదడు నరాలపై ప్రభావం చూపుతుందట. రక్త ప్రసరణ కూడా మందగిస్తుంది. అధిక మొత్తంలో కెఫిన్(caffeine) శరీరంలోకి చేరితే .. మైగ్రేన్ మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఫిల్టర్ కాఫీ కంటే కూడా ఇన్‌‌స్టాంట్ కాఫీ తాగడానికే ప్రాముఖ్యత ఇవ్వండి. 


హై-బీపీ ఉన్న సమయంలో కాఫీ తాగకండి. కాఫీ తాగడం వల్ల బీపీ పెరుగుతుంది. దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. షుగర్‌తో బాధపడేవారు కాఫీకి దూరంగా ఉండాలి. షుగర్ బాధితులు కాఫీ తాగడం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది.