ప్రపంచంలో అధికంగా రక్త హీనత సమస్యతో బాధపడుతున్నవారు పిల్లలు, మహిళలే. సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. రక్త హీనత వల్ల నాలుక, కనురెప్పలు పాలిపోయినట్టు అవుతాయి. ఆకలి కలుగదు. అలసటగా, చికాకుగా అనిపిస్తుంది. పిల్లలు ఆటలు ఆడేందుకు కూడా ఇష్టత చూపించారు. నీరసంగా ఉంటారు. కాబట్టి ఈ సమస్య చాలా తీవ్రమైనదనే చెప్పుకోవాలి. మన శరీరంలో అతి ముఖ్యమైనది రక్తం. రక్తంలో ఎర్రరక్తకణాలు ఉంటాయి. వాటిలో హిమోగ్లోబిన్ ఉంటుంది. ఈ కణాలు ఆక్సిజన్ ను శరీరంలోని వివిధ భాగాలకు చేరుస్తాయి. రక్తంలో ఎర్రరక్తకణాలు తగ్గడం వల్ల రక్త హీనత కలుగుతుంది. ఈ సమస్యను పోషకాహారం తినడం ద్వారా పరిష్కరించుకోవచ్చు. ఎర్ర రక్త కణాల సంఖ్య పెరిగేందుకు కింద చెప్పినవన్నీ తప్పకుండా డైట్ లో భాగం చేసుకోవాలి. 


1. బచ్చలి కూరలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. దీనితో పాటూ విటమిన్ బి9, బీటా కెరోటిన్, విటమిన్ సి, విటమిన్ కె1, యాంటీ ఆక్సిడెంట్లు కూడా లభిస్తాయి. పప్పులో రోజూ కాస్త బచ్చలి కూర వేసుకుని పది రోజులు తింటే ఎర్రరక్త కణాల సంఖ్య పెరగడం ప్రారంభమవుతుంది. 
2. అవిసె గింజలు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటాయి. ఓ గుప్పెడు గింజల్ని రోజూ వేయించుకుని తింటే మంచిది. వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ప్రోటీన్లు, పీచు పుష్కలంగా ఉంటాయి. పిల్లల చేత వీటిని తినిపించాల్సిన అవసరం ఉంది. 
3. పెసరపప్పు ద్వారా కూడా ఐరన్ దొరుకుతుంది. విటమిన్ బి9, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం కూడా పెసల ద్వారా అందుతుంది. రోజూ గుప్పెడు మొలకలొచ్చిన పెసలు తింటే చాలా ఆరోగ్యం. పెసరపప్పు కూర, దోశెలు ఎలా తిన్నా మంచిదే. 
4. పిల్లల చేత రోజూ ఉదయం పూట కప్పు పెరుగు తినిపించాలి. దీని వల్ల కాల్షియం, విటమిన్ బి12 అందుతుంది. దీని వల్ల రోగనిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. 
5. సోయా పాలు లేదా బీన్స్... ఎలా అయినా వాటిని తినడం మంచిది. వీటిలో కూడా ఇనుముతో పాటూ మెగ్నీషియం, క్యాల్షియం ఉంటాయి. పిల్లలకు మంచి పోషకాహారం ఇది.  
6. రోజే చెంచాడు మెంతి పొడి నీటిలో వేసుకుని తాగడమో లేక మెంతి ఆకులను పప్పులో వేసుకుని తినడమో చేయాలి. దీని వల్ల రక్త హీనత దరిచేరదు. వీటితో పాటూ సముద్ర చేపలు, రొయ్యలు, యాప్రికాట్లు, కిస్ మిస్లు, గ్రీన్ పీస్ వంటివి కూడా తినాలి. 


Also read: ఎక్కువ కాలం జీవించాలనుకుంటున్నారా? అయితే వీటిని తగ్గించండి...
Also read: దొంగలదాడి... భయంతో వార్డురోబ్లో దాక్కున్న నటి
Also read: ఈసారి ముమైత్ వంతు... ప్రశ్నల వర్షం కురిపిస్తున్న ఈడీ
ALso read: మన కూతుళ్లు సురక్షితమేనా... కడుపు తరుక్కుపోతోంది... మహేష్ బాబు భావోద్వేగ ట్వీట్
Also read: హాట్ హాట్ ఫోజులతో మతి పోగొడుతున్న మంజూష