చిన్నారులు నులి పురుగుల సమస్యతో బాధపడుతుంటారు. 1-19 సంవత్సరాల వారిపై ఈ నులి పురుగులు తీవ్ర ప్రభావం చూపుతాయి. చేతులు కడుక్కోకుండా భోజనం చేసినప్పుడు చేతుల ద్వారా నులి పురుగుల లార్వాలు నోటి ద్వారా కడుపులోకి వెళ్తాయి. పేగుల్లో నులిపురుగులుగా మారి రక్తంలోకి చేరాల్సిన పోషకాలను నులిపురుగులే పీల్చుకుంటాయి. దీంతో పిల్లల్లో ఎదుగుదల దెబ్బతింటోంది. 

Also Read: FolicAcid: ప్రతి రోజూ ఫోలిక్ యాసిడ్ అందే ఫుడ్ తింటున్నారా? గర్బిణులు మరీ ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి? లేదంటే...

లక్షణాలు: నులి పురుగుల వల్ల పిల్లలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా రక్తహీనత, పోషకాహార లోపం బారిన పడతారు. ఆకలి లేకపోవడం, బలహీనత, ఆందోళన, కడుపునొప్పి, వికారం, అతిసారం, మలంలో రక్తం, వ్యాధి నిరోధక శక్తి తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. నులి పురుగులు సంక్రమించిన చిన్నారుల్లో ఎదుగుదల నిలిచిపోతుంది. 

Also Read: Cancers: వారానికి 150 నిమిషాలు వ్యాయామం చేస్తే... క్యాన్సర్ల ముప్పు నుంచి కాస్త తప్పించుకోవచ్చు

ఎలాంటి ఆహారం తీసుకోవాలి: * తేనె, వెల్లుల్లి, గుమ్మడికాయ విత్తనాలు, దానిమ్మ పండ్లు, క్యారెట్‌ వంటి ఆహారం కడుపులోని పురుగులను తగ్గించడంలో తోడ్పడుతుంది. * పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. పుదీనా రసం పరకడుపున తీసుకోవడం ద్వారా మలము ద్వారా నులి పురుగులు బయటికి పోతాయి. * విటమిన్‌-సీ, జింక్‌ వంటి పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. కలుషితమైన నీళ్లను తాగకూడదు.

Also Read: Whiten Teeth: పళ్లు తెల్లగా మెరవాలంటే ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా... మీరు ఇంట్లో చేసుకునేందుకు సులువుగా

తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు*  బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయడం మానుకోవాలి.*  ఆహారంపై ఈగలు, దోమలు, కీటకాలు వాలకుండా చూడాలి.* పండ్లు, కూరగాయాలను శుభ్రంగా కడిగిన తర్వాతే వండుకోవాలి. *  చేతి గోర్లను ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి. *  భోజనానికి ముందు చేతులను సబ్బుతో కడుక్కోవాలి.*  ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.

* పిల్లల పేగుల్లో సాధారణంగా మూడు రకాల పురుగులు చేరతాయి. ఏలిక పాములు(ఆస్కారిస్‌ లుంబ్రికాయిడ్స్‌), కొంకి పురుగులు(అంకైలోస్టోమాడియోడెనేల్‌), చుట్ట పాములు (టీనియా సోలియం) అనే మూడు రకాలుంటాయి. * ఈ నులిపురుగుల జీవనకాలం 25 ఏళ్లు. వీటి గుడ్లు మట్టిలో 10 ఏళ్లకు పైగా దెబ్బతినకుండా ఉంటాయి.* సరిగ్గా ఉడికించని పంది, గొడ్డు మాంసం ద్వారా చుట్టపాములు కడుపులోకి చేరుతాయి. మట్టిలో ఆడితే పాదాల ద్వారా కొంకి పురుగుల లార్వాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి.