Miss Universe Singapore 2021: సిక్కోలు చిన్నదానికి సింగపూర్ అందాల కిరీటం.. నెక్ట్స్ ఎక్కడికి వెళ్తుందో తెలుసా

మిస్ యూనివర్స్ సింగపూర్ -2021 టైటిల్ ను తెలుగు యవతి దక్కించుకుంది. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన అమ్మాయి సొంతం చేసుకుంది.

Continues below advertisement

 

Continues below advertisement

మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌ 2021 కిరీటాన్ని తెలుగమ్మాయి నందిత బన్న దక్కించుకుంది.  25 ఏళ్ల క్రితం నందిత కుటుంబం సింగపూర్‌లో స్థిరపడింది. నందిత తల్లిదండ్రులు గోవర్థన్‌, మాధురి. వారి స్వస్థలం ఏపీలోని శ్రీకాకుళం జిల్లా. శుక్రవారం.. నేషనల్ మ్యూజియం సింగపూర్‌లో మిస్ యూనివర్స్ సింగపూర్ 2021 పోటీలు జరిగాయి. ఈ పోటిలో నందిత బన్న ఏడుగురు ఫైనలిస్టులతో పోటీ పడి టైటిల్‌ను కైవసం చేసుకుంది.


తండ్రి గోవర్ధనరావు సింగపూర్​లోని ఏవియేషన్ సప్లయ్ చెయిన్ సీనియర్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి మాధురి సివిల్ ఇంజినీర్ గా పని చేస్తున్నారు. సోదరుడు హర్ష సౌరవ్... కెనడా వాంకోవర్​లోని యూనివర్సిటీ అఫ్ బ్రిటిష్ కొలంబియాలో బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నారు.




ప్రస్తుతం నందిత వయస్సు 21 ఏళ్లు. మిస్ యూనివర్స్ సింగపూర్ 2021 గా ప్రస్థానాన్ని మొదలు పెట్టిన నందిత బన్న ప్రస్తుతం సింగపూర్ మేనేజ్‌మెంట్ యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్‌మెంట్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ లో డిగ్రీ ఫైనలియర్‌ చదువుతుంది. నందిత బన్న డిసెంబర్ లో ఇజ్రాయెల్‌లోని ఐలాట్‌లో జరిగే మిస్ యూనివర్స్ 2021 పోటిల్లో సింగపూర్‌ నుంచి ప్రాతినిధ్యం వహించనుంది.
ఆమెకి టెక్నాలజీ అంటే ఇష్టం. సింగపూర్‌ కేర్ కార్నర్ లో చురుకైన వాలంటీర్ గా ఉంటుంది. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నందిత లైఫ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడానికి సూచనలు చేస్తుంది.

 

Also Read: Bheemla Nayak Update: పవన్ కళ్యాణ్-రానా ‘భీమ్లానాయక్’ లో నిత్యామీనన్ తో పాటూ మరో మీనన్..రానాకు జోడీగా మలయాళ మారుతం..

Also Read: Maestro: ఎందుకు చంపుతోంది? తమన్నాను విలన్‌గా చూసి చిన్నారి ఏడుపు.. వీడియో ట్వీట్ చేసిన నితిన్

Continues below advertisement