మనదేశంలో ఆన్ లైన్ ఆర్డర్లు కేవలం బిర్యానీలు, కూరగాయలు, ఎలక్ట్రానిక్ వస్తువులు... ఇలాంటి ఉత్పత్తుల వరకు పరిమితమయ్యాయి కానీ బ్రిటన్ మనకన్నా చాలా ఫాస్ట్ కదా, అందుకే వీర్యాన్ని కూడా ఆన్ లైన్ లో అందించేస్తున్నారు. ఒక మహిళ ఇలా యాప్ లో ఆర్డరిచ్చి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడీ వార్త ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది.


ఇంగ్లాండులో ‘జస్ట్ ఏ బేబీ’అనే సంస్థ వీర్యదాతలను, సరోగేట్ సేవలను అందిస్తోంది. దానికి యాప్ కూడా ఉంది. నార్త్ యోర్క్‌షైర్‌కు చెందిన 33 ఏళ్ల స్టెఫెనీ టేలర్ అనే మహిళ యాప్ ద్వారా స్పెర్మ్ ను ఆర్డర్ ఇచ్చింది. అలాగే స్పెర్మ్ తన అండాశయంలో ప్రవేశపెట్టుకునేందుకు అవసరమయ్యే కిట్ ను కూడా తెప్పించుకుంది. యూట్యూబ్లో చూసి తనకు తానే స్పెర్మ్ ను అండాశయంలోకి ప్రవేశపెట్టింది. అది విజయవంతమై స్టెఫనీ గర్భవతి అయ్యింది. తొమ్మిది నెలల తరువాత పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఇలా వీర్యాన్ని ఎందుకు ఆర్డర్ ఇవ్వాల్సి వచ్చిందో వివరించింది ఆమె. 


స్టెఫనీకి అయిదేళ్ల బాబు ఫ్రాంకీ ఉన్నాడు. ఇతడు పుట్టిన కొన్ని రోజులకే భర్త మరణించాడు. ఫ్రాంకీ ఒక్కడే ఆడుకోవడం, అందరికీ అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు  ఉన్నా తనకు లేరని పదేపదే ఫ్రాంకీ అడగడం స్టెఫనీని ఆలోచింపజేసింది. తన కొడుకుకు మరో బిడ్డ తోడుగా కావాలని అనిపించి ఇలా ఆన్ లైన్ లో ఆర్డర్ చేసినట్టు చెప్పింది. అయితే తనకు వీర్యాన్ని దానం చేసిన వ్యక్తి గురించి చెప్పడానికి ఇష్టపడలేదు. తన కూతురు భవిష్యత్తులో ఆయన్ను కలసినా తానేమీ బాధపడనని చెప్పింది. ఆ పాపకు ‘ఈడెన్’అని పేరు పెట్టుకుంది స్టెఫనీ. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి


Also read: సాయిధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ ట్రైలర్ అదుర్స్... విడుదల ఎప్పుడంటే... చిరు ట్వీట్


Also read: ఒలింపిక్ విజేతతో బాలీవుడ్ బ్యూటీ బ్యాడ్మింటన్ మూమెంట్...


Also read: ఆ కల ఇప్పటికి నెరవేరుతోంది... బాబాయ్ గురించి రానా మనసులో మాట


Also read: లవ్ ప్రపోజ్ చేసిన లోబో.. నోరుజారిన షన్ను.. చుక్కలు చూపిస్తున్న శ్వేత


Also read: ఆ కల ఇప్పటికి నెరవేరుతోంది... బాబాయ్ గురించి రానా మనసులో మాట


Also read: సాయిధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ ట్రైలర్ అదుర్స్... విడుదల ఎప్పుడంటే... చిరు ట్వీట్