నిరుద్యోగులకు బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) గుడ్ న్యూస్ చెప్పింది. 269 గ్రూప్ సీ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ (GD) పోస్టుల భర్తీకి గత నెలలో నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేయనున్న ఈ పోస్టుల దరఖాస్తు గడువు నేటితో (సెప్టెంబర్ 22) ముగియనుంది. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు సంస్థ తెలిపింది. కబడ్డీ, బాక్సింగ్, స్విమ్మింగ్, జూడో, వాటర్ స్పోర్ట్స్, క్రాస్ కంట్రీ, హాకీ, జిమ్నాస్టిక్స్, వెయిట్ లిఫ్టింగ్, ఆర్చరీ, రెజ్లింగ్, అథ్లెటిక్స్ సహా 21 విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో కొన్ని పోస్టులకు అమ్మాయిలు కూడా దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పించింది. ఆసక్తి గల అభ్యర్థులు rectt.bsf.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. BSF పోస్టుల అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 


Also Read: Assam Rifles Recruitment 2021: టెన్త్ అర్హతతో 1230 ఉద్యోగాలు.. ఏపీ, తెలంగాణలో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే? 


వయో పరిమితి, విద్యార్హత.. 
2021 ఆగస్టు 1వ తేదీకి 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయసున్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు రిజర్వేషన్ల ఆధారంగా వయోపరిమితిలో సడలింపులు ఉన్నాయి. గుర్తింపు పొందిన బోర్డు / యూనివర్సిటీ నుంచి టెన్త్ (మెట్రిక్యులేషన్) పాస్ అయి ఉండాలి. ఛాంపియన్‌ షిప్, నేషనల్ గేమ్స్, అంతర్జాతీయ క్రీడోత్సవాల్లో పాల్గొన్నవారు, మెడల్స్ సాధించినవారు దీనికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. 


విభాగాల వారీగా ఖాళీల వివరాలు.. 
మహిళలు: అథ్లెటిక్స్ - 25, రెజ్లింగ్ - 10, ఆర్చరీ - 12, బాక్సింగ్ - 10, వెయిట్ లిఫ్టింగ్ - 9, జూడో - 8, వాటర్ స్పోర్ట్స్- 6, స్విమ్మింగ్ - 4, షూటింగ్ - 3, క్రాస్ కంట్రీ - 2 
పురుషులు: అథ్లెటిక్స్ - 20, స్విమ్మింగ్ - 12, రెజ్లింగ్ - 12, వుషూ - 11, కబడ్డీ - 10, తైక్వాండో - 10, బాక్సింగ్ - 10, వాటర్ స్పోర్ట్స్ - 10, వాలీబాల్- 10, వెయిట్ లిఫ్టింగ్ - 8, జూడో - 8, ఫుట్‌బాల్ - 8, జిమ్నాస్టిక్స్ - 8, ఆర్చరీ - 8, హ్యాండ్ బాల్ - 8, హాకీ - 8, బాస్కెట్ బాల్ - 6, బాడీ బిల్డింగ్ - 6, షూటింగ్ - 3, క్రాస్ కంట్రీ - 2, ఈక్వెస్ట్రియన్- 2. 


Also Read: CBSE CTET 2021: టీచర్ కావాలనుకునే వారికి గుడ్ న్యూస్.. సీటెట్ నోటిఫికేషన్ వచ్చేసింది.. ఇలా దరఖాస్తు చేసుకోండి


రూ.69,100 వరకు వేతనం..
గ్రూప్ సీ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు (లెవల్ 3 కింద) వేతనం చెల్లిస్తారు. వీటికి అదనంగా అలవెన్సులు ఉంటాయి. డాక్యుమెంట్ల వెరిఫికేషన్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు. 


Also Read: Indian Navy Recruitment 2021: ఇండియ‌న్ నేవీలో 181 పోస్టులు.. రాత ప‌రీక్ష లేకుండానే ఎంపిక.. ముఖ్యమైన తేదీలివే..


Also Read: Panchayat Secretary Jobs: తెలంగాణలో 172 జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీ.. ఏ జిల్లాల్లో ఎన్ని పోస్టులంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి