ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలనుకునే వారికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్- సీటెట్) నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది సీటెట్ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తున్నట్టు సీబీఎస్ఈ వెల్లడించింది. సీటెట్ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. గడువు అక్టోబర్ 19వ తేదీతో ముగియనుందని తెలిపింది. దరఖాస్తు ఫీజులను అక్టోబర్ 30 మధ్యాహ్నం 3:30 వరకు చెల్లించవచ్చని అభ్యర్థులకు సూచించింది. సీటెట్ పరీక్షలను డిసెంబర్ 16 నుంచి 2022 జనవరి 13 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొంది. సీటెట్ పరీక్షను దేశవ్యాప్తంగా 20 భాషల్లో నిర్వహించనున్నట్లు వివరించింది. బీఈడీ పూర్తి చేసిన వారు సీటెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
దరఖాస్తు ఫీజు వివరాలు..
ఒక పేపర్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రెండు పేపర్లకు అయితే రూ.1200 ఫీజు కట్టాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు ఒక పేపర్‌కు రూ.500.. రెండు పేపర్‌లకు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష విధానం, సిలబస్, అర్హత, దరఖాస్తు రుసుము తదితర సమగ్ర సమాచారాన్ని ctet.nic.in అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు. సీటెట్ అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సీటెట్ పరీక్ష కోసం ఇలా దరఖాస్తు చేసుకోండి..
1. సీటెట్ అధికారిక వెబ్‌సైట్ ctet.nic.inను ఓపెన్ చేయండి.
2. ఇక్కడ ‘Apply Online for CTET December 2021’ అనే లింక్ పై క్లిక్ చేయండి.
3. ఇక్కడ అభ్యర్థులు తమ వివరాలను రిజిస్టర్ చేసుకోవాలి. దీంతో రిజిస్టర్ నంబర్ జనరేట్ అవుతుంది. దీనిని సేవ్ చేసుకోవాలి.
4. దరఖాస్తును పూర్తి చేయాక.. నోటిఫికేషన్లో సూచించిన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.
5. దరఖాస్తు ఫీజు చెల్లించాలి. దీంతో దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.
6. భవిష్యత్ అవసరాల కోసం దీనిని ప్రింటవుట్ తీసుకోవాలి.
పరీక్ష విధానం..
సీటెట్ (Central Teacher Eligibility Test) రాత పరీక్ష డిసెంబర్ 16 నుంచి జనవరి 13 వరకు జరగనుంది. రెండు షిఫ్టులలో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిఫ్ట్.. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో షిఫ్ట్ ఉంటుంది. దీనిలో 2 పేపర్లు ఉంటాయి. 1 నుంచి 6వ తరగతి వరకు పేపర్-1.. 6 నుంచి 8వ తరగతి వరకు పేపర్-2 ఉంటాయి.
పేపర్-1 పరీక్ష 150 మార్కులకు నిర్వహిస్తారు. ఈ పేపర్లో 5 సెషన్లు ఉంటాయి. ఒక్కో సెషనుకు 30 మార్కుల చొప్పున మొత్తం 150 ప్రశ్నలు కేటాయించారు. ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, చైల్డ్ డెవలప్‌మెంట్ & పెడగాగి, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ అనే ఐదు సెషన్లు ఉంటాయి.
పేపర్-2 కూడా 150 మార్కులకు ఉంటుంది. ఇందులో చైల్డ్ డెవలప్‌మెంట్ & పెడగాగి, ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, మ్యాథమెటిక్స్ & సైన్స్ లేదా సోషల్ సైన్స్ / సోషల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. మొదటి 3 సెక్షన్ల నుంచి 30 ప్రశ్నల చొప్పున 90 ప్రశ్నలు అడుగుతారు. మిగతా 2 సెక్షన్లకు 60 మార్కులు కేటాయించారు.
8 ప్రాంతాల్లో సీటెట్ పరీక్ష కేంద్రాలు..
సీటెట్ పరీక్షను తెలంగాణ 8 ప్రాంతాల్లో నిర్వహించనున్నారు. గతేడాది వరకు కేవలం హైదరాబాద్‌లోనే ఎగ్జామ్ సెంటర్లు ఉండేవి. ఈసారి ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తున్న నేపథ్యంలో.. హైదరాబాద్‌తోపాటు ఖమ్మం, మహబూబ్‌నగర్, కరీంనగర్, కోదాడ, నిజామాబాద్, వరంగల్, నల్గొండలలో ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు.
Also Read: ATOS Recruitment: భారత్‌లో 15000 నియామకాలు.. నిరుద్యోగులకు 'అటోస్' గుడ్ న్యూస్