వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు మీడియా ప్రతినిధుల్ని ప్రశ్నిస్తున్నారు. జూలై నెలాఖరులో వివేకా ఇంటి వాచ్‌మెన్ రంగన్న వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు జమ్మలమడుగు కోర్టులో నమోదు చేశారు. ఆ వాంగ్మూలం గురించి టీవీ చానళ్లలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఇద్దరు ప్రముఖులు ఈ హత్య కోసం సుపారీ ఇచ్చారని పలు రకాలుగా మీడియా చానళ్లు ప్రసారం చేశాయి. కొన్ని చానళ్లు రెండు షాడో బొమ్మలను చూపి వారిద్దరు ఎవరూ అంటూ కథనాలు ప్రసారం చేశాయి. ఈ అంశాలపై సీబీఐ అధికారులు మీడియా ప్రతినిధుల్ని పిలిచి ప్రశ్నించారు. ఆ తర్వాత పలు టీవీ చానళ్లకు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. Also Read : హత్య చేసి కూడా ఏం యాక్టింగ్.. అయినా హంతకుల్ని పచ్చరాయి ఉంగరం పట్టించేసిందిలా..


రంగన్న వాంగ్మూల నమోదు చేసిన తర్వాత ఆయనను సీబీఐ అధికారులు పులివెందుల బస్టాండ్‌లో వదిలి పెట్టారు. అప్పుడు మీడియా ప్రతినిధులు, స్థానికులతో రంగన్న మాట్లాడారు. తన పేరు ఎవరికైనా చెబితే నరికి చంపుతానని ఎర్రగంగిరెడ్డి బెదిరించారని.. అందుకే తాను భయపడి ఎవరికీ ఏమీ చెప్పలేదన్నారు. ఎర్ర గంగిరెడ్డి, వివేకా పాత డ్రైవర్‌ దస్తగిరి, సునీల్‌కుమార్‌ పేర్లను రంగన్న మీడియా ప్రతినిధుల ముందు చెప్పారు. అయిేత న్యాయమూర్తి ముందు ఏం చెప్పానో తనకు గుర్తు లేదన్నారు. ఆ వీడియోలను కూడా టీవీ చానళ్లు ప్రసారం చేశాయి. ఈ కారణంగా టీవీ చానళ్లకు కూడా నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. Also Read : భర్త ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన భార్య, ఆ వెంటనే ఇంకో ఘాతుకం.. కారణం ఏంటంటే..


వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 107 రోజులుగా సాగుతోంది. ఇప్పటి వరకూ సునీల్ కుమార్ యాదవ్, దస్తగిరితో పాటు ఉమాశంకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. దాదాపుగా ప్రతి రోజూ అనుమానితుల్ని ప్రశ్నిస్తున్నారు. ఇటీవలి కాలంలో మీడియా ప్రతినిధుల్ని ప్రశ్నిస్తున్నారు. వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజున గుండెపోటు అని ప్రచారం జరిగింది. ముఖ్యంగా కొన్ని టీవీ చానళ్ల ప్రతినిధులు గుండెపోటుగానే ప్రచారం చేశారు. కొంత మంది నేతలు కూడా గుండెపోటు కారణంగానే చనిపోయారని సంతాపం ప్రకటించారు. ఈ విషయంపైనా కొంత మంది మీడియా ప్రతినిధుల్ని గతంలోనే ప్రశ్నించారు. Also Read : రహస్యంగా ప్రేమ పెళ్లి.. భారీ ట్విస్ట్ ఇచ్చిన ఫ్యామిలీ, అసలు సంగతి తెలిసి అఘాయిత్యం


త్వరలో గుండెపోటుగా ప్రచారం చేసిన వారిని కూడా ప్రశ్నించే అవకాశం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పటికే హత్యలో ప్రత్యక్షంగా ఎవరు పాల్గొన్నారో స్పష్టత వచ్చినట్లుగా సీబీఐ అధికారులు కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ల ద్వారా అభిప్రాయం కలుగుతోంది. సునీల్ కుమార్ యాదవ్, దస్తగిరి, ఉమాశంకర్ రెడ్డిలకు ప్రత్యక్ష ప్రమేయం ఉందని రిమాండ్ రిపోర్టుల్లో సీబీఐ పేర్కొంది. ఎర్ర గంగిరెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. 


Also Read : మీకు పని మనిషి ఉన్నారా? తస్మాత్ జాగ్రత్త! మీకూ ఇలా జరగొచ్చు.. ఇదో కొత్త రకం మోసం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి