అఫ్గానిస్థాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రపంచ దేశాల గుర్తింపు కోసం తాలిబన్లు తహతహలాడుతున్నారు. ఇతర దేశాలతో తాము సన్నిహిత సంబంధాలను కోరుకుంటున్నట్లు ఇప్పటికే తాలిబన్ల ప్రకటించారు. అయితే తాజాగా ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌కు తాలిబన్లు లేఖ రాశారు.
Also Read:Trending: యాసిడ్ - జాన్వి డెస్టినేషన్ పెళ్లి... విందులో చికెన్ బిర్యానీ, ట్రెండవుతున్న పెళ్లి వీడియో
న్యూయార్క్‌లో ఈ వారం జరగనున్న ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగించే అవకాశం ఇవ్వాలని కోరారు. దోహాలోని తమ అధికార ప్రతినిధి సుహైల్ షాహీన్‌ను ఐరాసలో అఫ్గాన్ ప్రతినిధిగా తాలిబన్లు ప్రతిపాదించారు. ఈ మేరకు తాలిబన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తకి లేఖలో పేర్కొన్నారు. అయితే ఇప్పటికే అఫ్గాన్ ముందున్న అఫ్రాష్ ఘనీ ప్రభుత్వం తరపున ఐరాసకు ప్రాతినిధ్యం వహిస్తోన్న గులాం ఇసాక్జాయ్ ఇంకా కొనసాగుతున్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం, అఫ్గానిస్థాన్ తరపున గులాం ఇసాక్జాయ్ ఈ సమావేశాల చివరి రోజున ప్రసంగించే అవకాశం ఉంది. అయితే ఇకపై ఆయన తమ దేశానికి ప్రాతినిధ్యం వహించరని తాలిబన్లు స్పష్టం చేశారు.
Also Read:Tumkur Condom Case: హైవేపై కండోమ్ కేసులో కళ్లుచెదిరే ట్విస్ట్.. సొరంగంలో శృంగార భోగాలు!
ఈ లేఖను ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అధికార ప్రతినిధి ఫర్హాన్ హక్ ధ్రువీకరించారు. తాలిబన్ల లేఖను 9 మంది సభ్యుల ఆధారాల కమిటీకి పంపినట్లు ఫర్హాన్ హక్ తెలిపారు. ఈ కమిటీలో అమెరికా, చైనా, రష్యా సభ్యులుగా ఉన్నాయి. మరి ఈ కమిటీ తాలిబన్ల విజ్ఞప్తిని అనుమతిస్తుందో లేదో చూడాలి.
Also Read:PM Modi US Visit: అమెరికా టూర్‌కు మోదీ పయనం.. బైడెన్‌తో భేటీపైనే అందరి దృష్టి
ఐరాస సమావేశాలు..
ఐక్యరాజ్య సమితి 76వ వార్షిక సర్వసభ్య సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభ ఉపన్యాసం సందర్భంగా ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్ ప్రపంచాన్ని హెచ్చరించారు. ఇదివరకు ఎన్నడూ చవిచూడని విధంగా యావత్ ప్రపంచం విపరీత సంక్షోభాలను ఎదుర్కొంటోందని ఆయన అన్నారు. కొవిడ్ విజృంభణ, వాతావరణ సంక్షోభం, అఫ్గానిస్థాన్ నుంచి ఇథియోపియా వరకు ఉద్రిక్త పరిస్థితులతోపాటు ఇతర దేశాల్లో శాంతికి విఘాతం కలిగిస్తున్న తిరుగుబాటు వంటి సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని ఐరాస పేర్కొంది. ఈ తరహా ఉపద్రవాన్ని లేదా విభజనను ప్రపంచం ఇంతకుముందెన్నడూ చూడలేదని అభిప్రాయపడింది.