క్వాడ్ సదస్సు, 76వ ఐరాస జనరల్ అసెంబ్లీలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాకు పయనమయ్యారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు సెప్టెంబర్ 22-25 వరకు మోదీ అగ్రరాజ్యంలో ఉండనున్నారు.
భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై జో బైెడెన్‌తో కలిసి సమీక్ష నిర్వహించనున్నట్లు మోదీ తెలిపారు. ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై చర్చించనున్నట్లు వెల్లడించారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను కలిసేందుకు తాను ఎదురుచూస్తున్నట్లు మోదీ ఈ సందర్భంగా అన్నారు.
బైడెన్-మోదీ సమావేశంలో రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఉగ్రవాద నిర్మూలన, అఫ్గాన్ పరిణామాలతో పాటు పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలు ప్రస్తావనకు రానున్నట్లు సమాచారం.
Also Read:Tumkur Condom Case: హైవేపై కండోమ్ కేసులో కళ్లుచెదిరే ట్విస్ట్.. సొరంగంలో శృంగార భోగాలు!
- సెప్టెంబర్ 23: ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని యోషిహిడే సుగాతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు ప్రధాని మోదీ. అదే రోజు అమెరికా కంపెనీల సీఈఓలతో ప్రధాని భేటీ అవుతారు. అనంతరం జో బైడెన్ ఏర్పాటు చేస్తోన్న విందులో మోదీ పాల్గొంటారు. ఈ విందులో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను మోదీ కలిసే అవకాశం ఉంది.
- సెప్టెంబర్ 24: అధ్యక్షుడు జో బైడెన్‌తో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అదే రోజు క్వాడ్ సమావేశం కూడా జరగనుంది.
- సెప్టెంబర్ 25: వాషింగ్టన్ నుంచి ప్రధాని న్యూయార్క్ పయనమవుతారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్‌జీఏ)లో మోదీ ప్రసంగిస్తారు.