కర్ణాటకలోని తుముకూరు సమీపంలో ఇటీవల కుప్పులు తెప్పలుగా కనిపించిన కండోమ్‌ల కేసు గుర్తుందా? అసలు ఈ కండోమ్‌లు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేసిన పోలీసులు ఎట్టకేలకు కేసును ఛేదించారు. అయితే ఈ కేసులో ట్విస్ట్ చూసి పోలీసులే షాకయ్యారు. 


అసలేం జరిగింది?


ఈ కేసు దర్యాప్తులో భాగంగా హైవే దగ్గర్లోని లాడ్జిలో పోలీసులు సోదాలు చేశారు. అయితే ఆ లాడ్జిలో ఓ భారీ సొరంగాన్ని గుర్తించారు. ఆ సొరంగం తలుపు తెరిచిన పోలీసులు అవాక్కయ్యారు. అందులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్నారు. కండోమ్‌లు ఇక్కడి నుంచే వచ్చినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. సొరంగంలో నుంచి వచ్చిన ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. లాడ్జిని తాత్కాలికంగా మూసివేసినట్లు పోలీసులు తెలిపారు.


Also Read:Viral fever in India: చిన్నారుల్లో వైరల్ ఫీవర్.. ఇప్పటికే 100 మంది మృతి.. పిల్లలను ఎలా కాపాడుకోవాలి?


అరెస్ట్..


ఈ కేసుపై తుమకూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఒడనాడి సేవా ట్రస్ట్‌ సహకారంతో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ కండోమ్‌ల కేసులో ఇప్పటివరకు ఐదుగురిని తుమకూరు పోలీసులు అరెస్టు చేశారు. 


Also Read: Covaxin for kids: చిన్నారులకు కొవాగ్జిన్ టీకా.. శుభవార్త చెప్పిన భారత్ బయోటెక్


కేసు ఇది..






కర్ణాటక తుముకూరు​ శివారులోని జాతీయ రహదారి 48పై ఇటీవల వందల సంఖ్యలో కండోమ్‌లు దర్శనమిచ్చాయి. ఇది చూసి అటుగా వెళ్లే వాహనదారులు ఆశ్చర్యపోయారు. శ్రీరాజ్​ థియేటర్​కు ఎదురుగా ఉన్న ఓ ఫ్లైఓవర్​పై కండోమ్​లు కుప్పలుగా కనిపించాయి. అయితే ఇందులో కొన్ని వినియోగించిన కండోమ్‌లు ఉండగా మరికొన్ని ప్యాకెట్లలో ఉన్నాయి. ఈ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ కేసులు ఛాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు.. దర్యాప్తు వేగవంతం చేశారు.


హైవే దగ్గర్లో ఉన్న లాడ్జిల్లో రైడ్ చేశారు. ఈ సోదాల్లో భాగంగా ఓ లాడ్జిలో ఈ సొరంగం దర్శనమిచ్చింది. ఆ సొరంగాన్ని వ్యభిచారానికి వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మొత్తం ఐదుగుర్ని అరెస్ట్ చేశారు.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.