ఉత్తరప్రదేశ్‌లో దాదాపు 100 మంది చిన్నారులు డెంగీ లక్షణాలతో మృతి చెందడం కలకలం రేపుతోంది. కొద్ది రోజులుగా ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్, మథురా జిల్లాలో చాలామంది చిన్నారులు తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి డెంగీ లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్న పరిస్థితి చూస్తున్నాం. యూపీలోని ఇతర జిల్లాలైన కాన్పూర్, ప్రయాగరాజ్, ఘజియాబాద్ లో కూడా ఇలాంటి కేసులు నమోదవ్వడం ఆందోళనకు గురిచేస్తుంది. అయితే ఈ వైరల్ ఫివర్ యూపీకి మాత్రమే పరిమితం చేయబడిందా? కాదు. ఢిల్లీ, బీహార్, హర్యానా, మధ్యప్రదేశ్. పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోనూ ఈ జ్వరంతో మరణించిన కేసులు నమోదయ్యాయి.


ఎందుకు ఈ ఇన్ఫెక్షన్..


సాధారణంగా పిల్లల్లో ఒక్క ఏడాదిలో 6 నుంచి 8 శ్వాసకోశ సంబంధమైన ఇన్ఫెక్షన్లు వస్తాయి. కొవిడ్ -19 లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత.. పిల్లలు బయటకు రావడం అనేది ఏదైనా ఇన్ఫెక్షన్ సోకేందుకు కారణమై ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాడైపోయిన ఆహారం తినడం, అపరిశుభ్రమైన నీటిని తాగడం లాంటివి చేస్తే... ఇలాంటి వైరల్ ఫీవర్స్ వచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఇన్ఫ్లూయెంజా, డెంగ్యూ, చికున్‌గున్యా, స్క్రబ్ టైఫస్ లాంటి వైరల్ ఇన్ఫెక్షన్లు ఆగస్టు నుంచి పిల్లలకు సోకుతున్నట్టు గుర్తించారు. డెంగ్యూ, చిన్‌కున్ గున్యా, మలేరియా వంటి వ్యాధులకు వర్షకాలం తర్వాత వచ్చే సీజన్ కారణమని చెబుతున్నారు వైద్యులు. డెంగ్యూ మరియు చికున్‌గున్యా ఈడెస్ ఈజిప్టి దోమ కాటుతో వస్తాయని.. ఇది నీటిలో పుడుతుందని, మలేరియాకు కారణమయ్యే అనాఫిలిస్ దోమ బురద నీటిలో పుడుతుందని అంటున్నారు.


"చాలా వరకు వైరల్  ఫీవర్స్ ఇన్ఫ్లూయెంజా లేదా డెంగ్యూ ద్వారా వస్తున్నాయి. ఈ జ్వరాలు మిమ్మల్ని చాలా బలహీనంగా, నీరసంగా చేస్తాయి. రోగుల వోళ్లంతా నొప్పులుగా అనిపిస్తాయి. ఈ జ్వరాలకు రోగుల స్థితిని బట్టి చికిత్స చేయడం, హైడ్రేషన్ తోనే.. మెరుగవుతుంది.' డాక్టర్లు చెబుతున్నారు.


వైరల్ ఫ్లూ కాకుండా ఈసారి డెంగ్యూ వ్యాప్తి కూడా ఉంది. మేం ప్రతిరోజూ పిల్లల్లో 3 నుంచి 5 డెంగ్యూ పాజిటివ్ కేసులు చూస్తున్నాం. చిన్నారుల్లో లక్షణాలు చూస్తే.. శరీర నొప్పులు, పొత్తి కడుపు నొప్పి ఉంటున్నాయి. రక్త పరీక్షలు చేసినప్పుడు నిర్ధారణ అవుతుంది. కొంతమంది ప్లేట్ లేట్స్ తగ్గిపోయి కూడా ఆసుపత్రుల్లో చేరుతున్నారు.
                                         - డాక్టర్ మీనా జె, కన్సల్టెంట్, పీడియాట్రిక్స్ విభాగం, ఆకాష్ హెల్త్‌కేర్, ద్వారక


స్క్రబ్ టైఫస్ కేసులు మరింత ప్రాణాంతకమని వైద్యులు అంటున్నారు. చిన్నారులు దీనితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. జాగ్రత్తగా ఉండాలని వెల్లడిస్తున్నారు. 


స్క్రబ్ టైఫస్ అంటే


స్క్రబ్ టైఫస్​ను బుష్ టైఫస్​ అని కూడా అంటారు. ఓరియెన్​షియా సుసుగాముషి అనే బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈశాన్య ఆసియా, ఇండోనేషియా, చైనా, జపాన్, భారత్, ఉత్తర ఆస్ట్రేలియాల్లో ఇది ఎక్కువగా వెలుగుచూస్తుంది. స్క్రబ్ టైఫస్ సోకిన చిగ్గర్స్ (లార్వా పురుగులు) కాటు ద్వారా ప్రజలకు ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.


లక్షణాలు


స్క్రబ్ టైఫస్ లక్షణాలు కూడా ఎన్నో ఇతర రోగాల లక్షణాలకు దగ్గరగా ఉంటాయి. పురుగు కుట్టిన 10 రోజుల్లో ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు బయటపడుతుంటాయి. అవి.. జ్వరం, చలి జ్వరంతల నొప్పిఒళ్లు, కండరాల నొప్పులు, పురుగు కుట్టిన చోట నల్లటిమచ్చ, మానసిక మార్పులు (భ్రమ నుంచి కోమా వరకు), ఒంటిపై ఎర్రటి దద్దుర్లు, తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారికి అవయవాల వైఫల్యం, రక్తస్రావం జరిగి చికిత్స అందించకపోతే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది.


చికిత్స ఎలా..
పై లక్షణాలు కనపడినా, ఈ వ్యాధి ప్రబలిన ప్రాంతాల్లో సంచరించినా ఆ సమాచారం వైద్యులకు వెల్లడించాలి. వైద్యులు.. రక్త పరీక్షలు చేయవచ్చు. టెస్టు రిపోర్టులు రావడానికి వారాల సమయం పడుతుంది. కాబట్టి అంతకన్నా ముందే చికిత్స ప్రారంభించే అవకాశం ఉంది.
ఈ చికిత్సలో డోక్సిసైక్లిన్ అనే యాంటీబయోటిక్ వాడతారు. అది అన్ని వయసుల వారికీ ఇవ్వొచ్చు. లక్షణాలు కనబడిన వెంటనే ఇది ఇస్తే త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. వ్యాధి సోకిన పెద్దలకు 200ఎంజీ డాక్సీసిలిసిన్​తో పాటు 500ఎంజీ అజిత్రోమైసిన్ కనీసం ఐదు రోజులు ఇవ్వాలి. పిల్లలకయితే 4.5ఎంజీ డాక్సీసిలిసిన్​, 10 ఎంజీ అజిత్రోమైసిన్​ ఇవ్వాలి. గర్భిణీలకు 500ఎంజీ అజిత్రోమైసిన్ ఇవ్వాలని డాక్టర్లు చెబుతున్నారు. అందుబాటులోని వైద్యుడిని కిలిస్తే మంచిది.


జాగ్రత్తలు అవసరం 
ఏ వ్యాధి ప్రబలినప్పుడైనా.. జాగ్రత్తలు పాటించడం అవసరం. ఉండే పరిసరాల చుట్టూ దోమలు లేకుండా చూసుకోవాలి. ఇళ్ల వద్ద నిలిచిపోయిన నీటిని ఉండకూండా చూసుకోవాలి. పిల్లలు బయటకు వెళ్లినప్పుడల్లా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. 


ఎప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లాలి
జ్వరం వచ్చిన తర్వాత 3-4 రోజులకు మించి చూడకూడదు. చిన్నారికి 103-104 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ జ్వరంతో బాధపడుతుంటే గమనించి ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఒకవేళ జ్వరం లేనప్పటికీ ఆహారం తీసుకోకపోతే, శరీరంలో నొప్పులు ఉంటే.. వైద్యుడిని సంప్రదించాలి. పిల్లల శరీరంపై దద్దుర్లు, మూత్ర సమస్యలు వస్తే.. చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాలి.


Also Read: Knee Pain: మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? ఈ చిట్కాలు ట్రై చేయండి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి