ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో ఏకంగా 50 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టు నాలుగు వారాల పాటు సస్పెండ్ చేసింది. ఇటీవల పాలక మండలిని నియమించిన ప్రభుత్వం 25మంది సభ్యులను అధికారికంగా నియమించింది. అయితే ప్రత్యేక ఆహ్వానితులంటూ మరో 52 మందిని నియమించింది. దీని కోసం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో కొందరు ప్రమాణస్వీకారం కూడా చేశారు. అయితే ఈ నియామకాలు చట్ట విరుద్ధమని.. హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి.


Also Read : అక్టోబర్ 7 నుంచి 15 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు... ఈ ఏడాది ఏకాంతంగానే సేవలు.. ఆ జిల్లాల భక్తులకు గుడ్ న్యూస్


తిరుపతి బీజేపీ నేత  భాను ప్రకాష్ రెడ్డితో పాటు జనశక్తి వెల్ఫేర్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపకుడు కాకుమాను లలిత్‌కుమార్‌, టీడీపీ నేత మాదినేని ఉమా మహేశ్వర నాయుడు తదితరులు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఎపి ఎండోమెంట్ యాక్ట్ 1987కు విరుద్దంగా బోర్డు నియామకం జరిగిందని పిల్ లో వీరు పేర్కొన్నారు. వీరు తమ పిటిషన్లను అత్యవసరంగా విచారించాలని కోరారు. అత్యవసరంగా విచారించకపోతే నియమితులైన వారు ప్రమాణస్వీకారం చేస్తారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు బుధవారం ఉదయం విచారణ జరిపిన హైకోర్టు జీవోను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.


Also Read : మద్యం దుకాణాల్లో "గౌడ్‌"లకే 15 శాతం ! తెలంగాణ సర్కార్ నిర్ణయానికి కారణం ఏమిటి ?


టీటీడీ బోర్డును ప్రకటించినప్పటి నుండి తీవ్ర వివాదాస్పదమవుతోంది. రాజకీయ అవసరాల కోసం, లాబీయింగ్ చేసే వారిని, వివిధ కేసుల్లో ఉన్న వారిని పవిత్రమైన ఆలయంలో పాలక మండలి సభ్యులుగా చేర్చారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ట్రస్ట్ బోర్డును రద్దు చేయాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం గవర్నర్ ను కలిసి ఇదే అంశం పైన ఫిర్యాదు చేశారు. అదే సమయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏపీ ప్రభుత్వానికి రాసిన ఓ లేఖ కూడా సంచలనాత్మకం అయింది. తాను సిఫార్సు చేసినందుకు వరప్రసాద్ అనే వ్యక్తిని ప్రత్యేక ఆహ్వానితునిగా నియమించారని ప్రచారం జరుగుతోందని కానీ తాను ఎవర్నీ సిఫార్సు చేయలేదన్నారు. దీని పైన పరిశీలన చేయాలని కోరారు.


Also Read: Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పిన టీటీడీ ఛైర్మన్‌


హైకోర్టును జీవోను సస్పెండ్ చేయడంతో పూర్తి స్థాయి పాలక మండలి సభ్యులుగా నియమితులైన 25 మందికి మాత్రమే పదవులు ఉంటాయి. ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులైన 50 మందికి పదవులు రద్దవుతాయి.  ప్రభుత్వం మళ్లీ డివిజనల్ బెంచ్‌కో లేకపోతే.. మరో విధంగానో  చట్ట ప్రకారమే చేశామని కోర్టు నుంచి ఆమోదం పొందితేనే వారికి పదవులు ఉంటాయి. లేకపోతే లేనట్లే. 


Also Read : అచ్చెన్న, నిమ్మలకు అసెంబ్లీలో నో మైక్ ! స్పీకర్‌కు ప్రివిలేజ్ కమిటీ కీలక సిఫార్సు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి