ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షా కాల సమావేశాలు ప్రారంభమవనున్న సమయంలో తెలుగుదేశం పార్టీకి ప్రివిలేజ్ కమిటీ షాక్ ఇచ్చింది. ఆ పార్టీకి చెందిన శాసనసభాపక్ష ఉప నేతలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడులకు అసెంబ్లీలో మాట్లాడేందుకు ఈ సమావేశాల వరకూ మైక్ ఇవ్వకూడదని స్పీకర్‌కు సిఫార్సు చేసింది. సీఎం జగన్‌మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషించారని వారిపై చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.గతంలో అసెంబ్లీ సమావేశాల్లో సామాజిక పెన్షన్లపై చర్చ జరుగుతున్న సమయంలో వృద్ధులకు రూ. మూడు వేల పెన్షన్ పెంచుకుంటూ వెళ్తామన్న అంశంపై మాట్లాడుతున్న సమయంలో నిమ్మల రామానాయుడును సీఎం జగన్మోహన్ రెడ్డి డ్రామానాయుడు అని పదే పదే సంబోధించారు. దీనికి రామానాయుడు తాను డ్రామానాయుడు అయితే మీరు .. మీరు జైలు రెడ్డా..? అని ప్రశ్నించారు. Also Read : ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే ! రోడ్డున పడుతున్న రాజమండ్రి వైఎస్ఆర్‌సీపీ రాజకీయం !
రామాాయుడు వ్యాఖ్యలకు సీఎం జగన్మోహన్ రెడ్డికి కోపం వచ్చింది. సభ్యుడిపై స్వయంగా ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. దీనిపైనే ప్రివిలేజ్ కమిటీ చర్చించి నిమ్మల రామానాయుడుకు మైక్ ఇవ్వకూడదని నిర్ణయించుకుంది. ఇక ఇక అచ్చెన్నాయుడుపై వివిధ రకాల కారణాలు చూపుతూ.. చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి నోటీసులు ఇచ్చారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల ప్రివిలేజ్ మోషన్ కూడా ఉంది. వాటికి అచ్చెన్నాయుడు జవాబులు ఇచ్చారు. గత విచారణలో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇచ్చారు. అయితే ఆయనకు కూడా మైక్ ఇవ్వకూడదని ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు చేసింది.Also Read : బీజేపీకి మజ్లిస్ మిత్రపక్షమా ? శత్రుపక్షమా ? ఎందుకు ఓట్లు చీల్చి సహకరిస్తోంది ?
ప్రివిలేజ్ కమిటీలో సభ్యుడిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ సీఎం అన్న దానికే రామానాయుడు స్పందించారని కావాలంటే రికార్డులను పరిశీలించుకోవాలని సూచించారు. అయినప్పటికీ వైసీపీకి చెందిన ఇతర సభ్యులు ప్రివిలేజ్ కమిటీలో ఎక్కువగా ఉండటంతో మైక్ ఇవ్వకూడదనే సిఫార్సు చేశారు. ఈ అంశంపై మీడియాతో మాట్లాడిన నిమ్మల రామానాయుడు ప్రజా సమస్యలను ప్రస్తావిస్తేనే మైక్ ఇవ్వకుండా నిర్ణయం తీసుకుంటారా అని ప్రశ్నించారు. తాను సీఎంను వ్యక్తిగతంగా దూషించలేదని స్పష్టం చేశారు. ప్రివిలేజ్ కమిటీ సిఫార్సును స్పీకర్ ఆమోదించరని.. తన హక్కులను కాపాడతారని భావిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఒక వేళ మైక్ ఇవ్వకుండా అడ్డుకుంటే ప్రతిపక్ష గొంత నొక్కినట్లేనని ఆయన స్పష్టం చేశారు. Also Read : వట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు తలపెట్టాలి ! జగన్‌కు ఎంపీ రఘురామ సూచన !
తెలుగుదేశం పార్టీకి అసెంబ్లీలో 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వారిలో నలుగురు అనధికారికంగా వైసీపీలో చేరిపోయారు. గంటా శ్రీనివాసరావు లాంటి సైలెంట్‌గా ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ప్రతిపక్షం తరపున దూకుడుగా మాట్లాడేది అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడే. వీరిద్దరికీ మైక్ కట్ చేస్తే ఇక ప్రతిపక్షానికి పెద్ద వాయిస్ ఉండదని భావిస్తున్నారు.
Also Read : వైఎస్‌ఆర్‌సీపీ పంతం - టీడీపీ నిర్లక్ష్యం ! కుప్పంలో కదిలిన చంద్రబాబు పునాదులు !