Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పిన టీటీడీ ఛైర్మన్
Continues below advertisement
మరో వారం రోజుల్లో శ్రీవారి భక్తులందరికీ ఆన్ లైన్ బుకింగ్ ద్వారా సర్వ దర్శనానికి పొందే అవకాశం కల్పిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తెలిపారు. సుపథం దర్శనానికి ఎన్ని టికెట్లు మంజూరు చేస్తున్నారో.. అంతకు రెట్టింపుగా సర్వదర్శనం టోకెన్ లను ఆన్ లైన్ లో విడుదల చేస్తామన్నారు. టోకెన్ల విడుదలకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నట్లు చెప్పారు. కౌంటర్ల ద్వారా టోకెన్లను పొందే సమయంలో ఆ టోకన్లు అయిపోయాయని, భక్తులు ఆందోళనకు దిగడం, లాఠీచార్జి వంటి పరిణామాలు జరగడం బాధాకరమన్నారు.. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్ లైన్ ద్వారా సర్వదర్సనం టోకెన్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు..
Continues below advertisement