పూర్వం పెద్ద వయసు వారికే గుండె జబ్బులు వచ్చేవి. ఇప్పుడు 30లలో, 40లలో ఉన్నవారు కూడా గుండె పోటుతో మరణిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం మన ఆహారమే కావచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. గుండె కు చేటు చేసే చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ వంటివి శరీరంలో పెరిగిపోవడం వల్ల కూడా గుండె సమర్ధవంతంగా పనిచేయలేక మధ్యలోనే ఆగిపోతోంది. కనుక మన ఆహారపద్దతులను మార్చుకుని, శరీరంలో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ వంటి వాటి శాతాన్ని తగ్గించే ఆహారపదార్థాలు తినడం అలవాటు చేసుకోవాలి.


శరీరం తనకు తానుగా కొంత కొలెస్ట్రాల్ ను తయారుచేసుకుంటుంది. మిగతాది మనం తినే ఆహారం ద్వారా చేరుతుంది. కొలెస్ట్రాల్ లో కూడా రెండు రకాలు ఉన్నాయి. అది హెచ్డీఎల్, ఎల్డీఎల్. వీటిలో ఎల్టీఎల్ ను చెడు కొలెస్ట్రాల్ గా చెబుతారు వైద్యులు. మనం తినే ఆహారం ద్వారా ఈ చెడు కొలెస్ట్రాల్ చేరకుండా చూసుకోవాలని అంటారు. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ఆరోగ్య నిపుణులు ఈ విషయంలో ఏఏ ఆహారాన్ని తినడం ద్వారా ఎల్టీఎల్ ను తగ్గించుకోవచ్చో ఓ లిస్టు తయారుచేశారు. వాటిని తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ శాతం తగ్గుతుందని, దీని వల్ల గుండె సురక్షితంగా ఉంటుందని చెబుతున్నారు. 


ఓట్స్
బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ లో అరటి పండు, లేదా స్ట్రాబెర్రీలు వేసుకుని తింటే చాలా మంచిది. ఇందలో కరిగే లక్షణమున్న బీటా గ్లూకాన్ ఉంటుంది. అది జీర్ణక్రియ వేగాన్ని తగ్గించి, ఆకలిని లేకుండా చేస్తుంది. పేగులోని కొలెస్ట్రాల్ ను జీర్ణ క్రియ ద్వారా శరీరం నుంచి బయటికి వెళ్లేలా చేస్తుంది. 
బీన్స్
కిడ్నీ బీన్స్, బ్లాక్ ఐడ్ బీన్స్... ఇలా వేటినైనా రోజు వారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చూసుకుంటాయి. ఇందులో కూడా కరిగే లక్షణాలున్న ఫైబర్ ఉంది. కనుక చెడు కొలెస్ట్రాల్ ను రక్తంలో చేరనివ్వదు. 
వంకాయ, బెండకాయ
వీటిని తరచూ మన ఇళ్లల్లో వండుతూనే ఉంటారు. వీటిలోనూ కరిగే లక్షణాలున్న ఫైబర్ ఉంది. కనుక తరచూ తింటే చాలా మంచిది. చిలగడ దుంప, బ్రకోలీ, ప్రూన్స్ కూడా ఆరోగ్యాన్నిచ్చేవే. 
నట్స్
జీడిపప్పులు, బాదం, పిస్తా,  వాల్ నట్స్, వేరు శెగన పలుకులు వంటివన్నీ నట్స్ కిందకి వస్తాయి. వీటిలో మేలు చేసే అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇందులో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ ను పొట్ట నుంచి రక్త ప్రవాహంలోకి చేరకుండా అడ్డుకుంటుంది. 
పండ్లు
యాపిల్, ద్రాక్ష, స్ట్రాబెర్రీలు, సిట్రస్ పండ్లు, టమోటాలు, అవకాడోలు, బొప్పాయి... ఈ పండ్లలో పెక్టిన్ అని పిలిచే ఫైబర్ ఉంటుంది. ఇది ఎల్డీఎల్ ను కరిగించేస్తుంది. 
సోయా
సోయాపాలు, టోఫు వంటి సోయా బీన్స్ తో చేసే పదార్థాలను తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ పై ఇది శక్తి వంతంగా పనిచేస్తుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సోయా గణనీయంగా కొలెస్ట్రాల్‌ను తగ్గించదని తేల్చింది. 



Also read: GI Tag: మణిపురి మిరపకాయ, నారింజలకు ప్రత్యేక గుర్తింపు
Also read: రోజుకో గంట చూయింగ్ గమ్ నమిలితే ఒత్తిడి హుష్..
Also read: భోజనం చేశాక ఈ పనులు చేయకండి... అనారోగ్య సమస్యలు తప్పవు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి