2021 సెప్టెంబరు 22 బుధవారం రాశిఫలాలు


మేషం
వ్యాపార ప్రణాళికలు వేసుకోవచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.  చట్టపరమైన అడ్డంకులు తొలగిపోతాయి. కొత్త పనులు చేపట్టేందుకు అనుకూలసమయం. పెద్దల సలహాలు తీసుకోండి. శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి. మీరు ఏదో విషయం గురించి ఆందోళన చెందుతారు. మీకు ఎవరితోనైనా వివాదం ఉండవచ్చు. ఓర్పుగా ఉండాలి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. 


వృషభం
ఆదాయం పెరుగుతుంది. అనవసర వాదనలు వద్దు.  బంధువులు, స్నేహితులను కలుస్తారు. పెట్టుబడి ప్రణాళికను రూపొందించవచ్చు. ఈ రోజంతా సంతోషంగా ఉంటారు.  ఉద్యోగస్తులకు శుభసమయం. ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీ వ్యాపారం ఊపందుకుంటుంది. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. 


మిథునం
తెలియని వ్యక్తులతో వ్యవహారాలు వద్దు. చేపట్టిన పనిలో స్నేహితుల మద్దతు పొందుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.  ఈ రోజు సరదాగా ఉంటారు. వ్యాపారంలో కొన్ని ఒడిదొడుకులు ఉండొచ్చు. మీ ప్రతిష్ట పెరుగుతుంది. ఓ పనిపై ప్రయాణం చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలుంటాయి.


కర్కాటక రాశి
ఆర్థిక పరిస్థితి బావుంటుంది. మీకు స్నేహితుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. కొత్త వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయి.  ఆరోగ్యం బాగానే ఉంటుంది. కొత్త సమాచారం వింటారు. ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. కార్యాలయ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. సహచరులు సహాయం చేస్తారు.  పిల్లల వైపు నుంచి శుభవార్త ఉంటుంది.


Also Read:ఈ వారం ఈ రాశులవారికి చాలా ప్రత్యేకం..వీరు శుభవార్తలు వింటారు..ఆ రాశుల వారు మాత్రం దూర ప్రయాణాలు ప్లాన్ చేసుకోపోవడం మంచిది


సింహం
కుటుంబ సభ్యులతో మెరుగైన సామరస్యం ఉంటుంది. చట్టపరమైన అడ్డంకులు తొలగిపోతాయి. పూర్వీకుల విషయాలు పరిష్కారమవుతాయి. పెద్దల సలహాలు తీసుకోండి. ఈ రోజు మీరు ఏదో విషయం  గురించి ఆందోళన చెందుతారు. మీకు ఎవరితోనైనా వివాదం ఉండవచ్చు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపార ప్రణాళికలు వేసుకోవచ్చు. 


కన్య
రోజు మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు.  విద్యార్థులు విజయం సాధిస్తారు. అప్పిచ్చిన మొత్తం తిరిగి పొందుతారు.  కార్యాలయంలో అధికారులతో సమావేశం ఉంటుంది. మాట్లాడేటప్పుడు మీరు సంయమనం పాటించాలి. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. 


తులారాశి
వ్యాపారవేత్తలు కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు. బంధువుతో అభిప్రాయ భేదాలు ఉంటాయి. మీరు కోపాన్ని నియంత్రించుకోవాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి. ఈ రోజు మీకు మంచి రోజు. పెట్టుబడి ప్రయోజనకరంగా ఉంటుంది. జ్ఞానోదయమైన వ్యక్తిని కలిసే అవకాశం మీకు లభిస్తుంది. అపరిచితులకు దూరంగా ఉండండి. 


వృశ్చికరాశి
వివాదానికి అవకాశం ఉంది. ఈ రోజు మీ వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు. వైవాహిక జీవితంలో కొన్ని విభేదాలు తలెత్తవచ్చు. ఈరోజు సవాళ్లతో నిండి ఉంటుంది. వ్యాపారంలో విజయం సాధిస్తారు.  కొన్ని శుభవార్తలు అందుతాయి. ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి. అనవసర వాదనలు వద్దు. 
Also Read: అర్థరాత్రి వేణుగానం, గజ్జెల శబ్దాలు…ద్వాపరయుగం నుంచి కలియుగం వరకూ అంతుచిక్కని రహస్యం..ఆ ఆలయంలో చీకటి పడ్డాక ఏం జరుగుతుంది..!


ధనుస్సు
అవివాహితులకు సంబంధాలు కుదిరే అవకాశం ఉంది.  ఈ రోజు ముఖ్యమైన నిర్ణయం తీసుకోకండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీ ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీరు చాలా సంతోషంగా ఉంటారు. డబ్బు సంపాదించేందుకు అవకాశాలు ఉంటాయి. కారణం లేకుండా ఎవరితోనైనా వివాదాలు ఉండొచ్చు. వివాదాస్పద విషయాల్లో జోక్యం చేసుకోకండి. నిలిచిపోయిన మీ పని పూర్తవుతుంది. 


మకరం
మీకు ఈ రోజు మంచి రోజు.  విద్యార్థులు చదువులో విజయం సాధిస్తారు. యువత మరింత కష్టపడాల్సి ఉంటుంది.  పెట్టిన పెట్టుబడి మంచి ఫలితాలు ఇస్తుంది.  తెలియని వ్యక్తిని ఎక్కువగా విశ్వసించవద్దు. ప్రత్యర్థులు మీకు హాని కలిగించవచ్చు. ఎక్కువ రిస్క్ తీసుకోవడం మానుకోండి. ఆరోగ్యం బాగుంటుంది. 


కుంభం
ప్రతిష్ట పెరుగుతుంది. వ్యాపారానికి సంబంధించి పెద్ద ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు బంధువుని కలవవచ్చు. ఈ రోజు మీకు అద్భుతంగా  ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలున్నాయి. స్నేహితులతో సమయం గడపగలుగుతారు.


మీనం
నిలిచిపోయిన పని పూర్తవుతుంది. ముఖ్యమైన పనికి సంబంధించి మీరు ప్రయాణం చేయవచ్చు. బంధువులు వస్తారు.  పెట్టిన పెట్టుబడి నుంచి మంచి లాభాలు పొందుతారు. అదే పనిగా తినే అలవాటుని మానుకోండి.ఈ రోజు సాధారణంగా ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. డబ్బు సంపాదించే అవకాశం ఉంది. 


Also Read: ఆర్ ఆర్ ఆర్ మూవీ క్రేజ్ తో వ్యాపారం, అభిమానుల కోసం టీషర్ట్స్ మాస్క్, మగ్స్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి