మీమ్స్ రూపంలో ప్రజల భద్రత గురించి సైబరాబాద్ పోలీసుల తరచూ అవగాహన కల్పించే సంగతి తెలిసిందే. సైబర్ మోసాలు, ట్రాఫిక్ నిబంధనలపై ఎల్లప్పుడూ యువతకు అర్థమయ్యే రీతిలో ఇలా మీమ్స్ రూపంలో వివరించే సైబరాబాద్ పోలీసుల దారిలోనే ఇప్పుడు హైదరాబాద్ సిటీ పోలీసులు కూడా చేరారు. తాజాగా ఓ అంశంలో జాగ్రత్తగా ఉండాలంటూ వారు తయారు చేసి ట్విటర్‌లో వదిలిన ఓ మీమ్.. విపరీతంగా వైరల్ అవుతోంది. ఓ కంపెనీ టీ పొడికి సంబంధించిన వాణిజ్య ప్రకటన ఇటీవల బాగా వైరల్ అవుతోంది. దాన్ని వివిధ సందర్భాల్లో వాడేస్తూ మీమ్‌గా జనం తెగ వాడేస్తున్నారు. ఇప్పుడు దాన్నే హైదరాబాద్ పోలీసులు కూడా వాడేశారు.


Watch: అసలు పిడుగులు ఎందుకు పడతాయి.? పిడుగుపాటుకు కారణమయ్యే సైన్స్ ఏంటి?


సామాజిక మాధ్యమాల్లో కనిపించే లేదా వాట్సాప్ ద్వారా ఫార్వర్డ్ అవుతూ వచ్చే అనవసరమైన, ఫేక్ లింకులు క్లిక్ చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే అంశంపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ పోలీసులు ఈ మీమ్‌ను వాడారు. ఇటీవల కాలంలో ‘అయ్యయ్యో వద్దమ్మా... సుఖీభవ’ మీమ్‌ సోషల్‌ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ మీమ్‌ను దానికి అన్వయించడం సరదాగా అనిపిస్తోంది. దీంతో ఇది నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 


Also Read: Weather Updates: బంగాళాఖాతంలో నేడు మరో అల్ప పీడనం.. ఏపీ, తెలంగాణలో వర్షాలు ఇలా..


‘‘కంగ్రాట్స్.. మీరు స్పెషల్ క్రికెట్ గిఫ్ట్ గెల్చుకున్నారు.’’ అంటూ సైబర్ నేరగాళ్లు కొన్ని ఫేక్ లింక్స్ పంపుతుంటారు. ఆ లింక్స్‌ను క్లిక్ చేస్తే మన ఫోన్‌లో ఉండే డేటా మొత్తం అపహరణకు గురవుతుంది. ఇలా ఎంతో మంది సైబర్ క్రైమ్ పోలీసులను గతంలో ఆశ్రయించారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ పోలీసులు తాజా మీమ్‌ను చేసి ట్విటర్‌లో ఉంచారు. ఆ లింక్‌లు వస్తే ‘‘అయ్యయ్యో వద్దమ్మా..’’ (యాడ్‌లో యువతి అనే డైలాగ్) అంటూ వాటికి దూరంగా ఉండాలంటూ సూచించారు. ఈ మీమ్ చూసిన నెటిజన్లు విపరీతంగా రీట్వీట్లు, లైక్‌లు, కామెంట్లు చేస్తున్నారు.






పాపులర్ అయిన మీమ్
ఇటీవల ఓ యువకుడు ఈ ‘సుఖీభవ’ యాడ్‌ను మరింత కామెడీగా చేశాడు. ఆ యాడ్‌ను రీ క్రియేట్‌ చేసి తీన్మార్‌ స్టెప్పులేయడం అందర్నీ బాగా ఆకర్షించింది. విపరీతంగా ఆ యాడ్ మీమ్‌కు చాలా మంది కనెక్ట్ అయ్యారు. అలాంటి ట్రెండింగ్ మీమ్‌ను హైదరాబాద్ పోలీసులు ఎంచుకొని ఈ నేపథ్యంలో ప్రైజ్‌ మనీ గెలిచారంటూ లింకులు పంపి ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడే వాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ హైదరాబాద్‌ సిటీ పోలీసులు ఈ మీమ్‌ను వాడేశారు.


Also Read: RGV : కొండా మురళి, సురేఖల బయోపిక్‌పై ఆర్జీవీ గురి ! మళ్లీ వివాదం తప్పదా ?