శుక్రవారం( సెప్టెంబర్ 24వ తేదీ) నుంచి తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం శాసనసభ ప్రాంగణంలోని కమిటీ హల్ లో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసన మండలి ఛైర్మన్ వి.భూపాల్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. 

సజావుగా జరిగేందుకు చర్యలు

గత అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలను విజయవంతంగా నిర్వహించామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సమావేశాలు సజావుగా జరిగేందుకు ప్రభుత్వ అధికార యంత్రాంగం అద్భుతంగా పని చేస్తుందన్నారు. ఈ నెల 24 తేదీ నుండి జరిగే సమావేశాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజా సమస్యలపై చర్చించే విధంగా నిర్వహిస్తామన్నారు. గతంలో మాదిరిగానే ప్రతి డిపార్ట్మెంట్ నుంచి నోడల్ అధికారులను నియమించాలని నిర్ణయించామన్నారు. నోడల్ అధికారులతో  తెలంగాణ లెజిస్లేటివ్ సెక్రెటరీ ఒక  వాట్సప్ గ్రూప్ క్రేయేట్ చేసి అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. 

Also Read: TS Assembly : "దళిత బంధు"కు చట్టబద్ధత .. రేపట్నుంచే తెలంగాణ అసెంబ్లీ !

పోలీసులతో స్పీకర్ సమావేశం

అనంతరం పోలీస్ అధికారులతో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సమావేశం నిర్వహించారు. దేశంలోని ఇతర శాసన సభ సమావేశాలకు ఆదర్శంగా ఉండేలా  తెలంగాణ శాసనసభ సమావేశాలు పారదర్శకంగా జరుగుతున్నాయని తెలిపారు.  ప్రతి అంశంపై సభ్యులందరు కుళంకశంగా మాట్లాడానికి అవకాశం వస్తుందన్నారు. సభ సజావుగా సాగడానికి అసెంబ్లీ లోపల బయట పోలీసుల పాత్ర ఎంతో ముఖ్యమని గుర్తుచేశారు. ఈ సమావేశాలు కూడా గత సమావేశాల మాదిరిగా సజావుగా సాగడానికి పోలీసు డిపార్ట్మెంట్ లోని అన్ని శాఖలు సమన్వయం చేసుకోవాలని స్పీకర్ ఆదేశించారు. 

Also Read:  CM KCR Delhi Tour: రేపు ఢిల్లీకి తెలంగాణ సీఎం కేసీఆర్.. అమిత్ షా తో భేటీ

సభలో బీజేపీ వ్యూహంపై చర్చ

అసెంబ్లీ సమావేశాల వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలతో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చర్చించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావులు ఈ యాత్రలో పాల్గొన్నారు. బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొన్న శాసన సభ్యులతో అసెంబ్లీలో  చర్చించాల్సిన అంశాలపై చర్చించారు. రేపటి నుండి జరగబోయే శాసన సభ సమావేశాలను పొడిగించాలని బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, రాజా సింగ్ డిమాండ్ చేశారు. కేవలం మూడు రోజులు కాకుండా, ఒక నెల రోజుల పాటు కొనసాగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని వారు స్పష్టం చేశారు. రేపటి శాసన సభలో ప్రభుత్వ వైఫల్యాల మీద నిలదీస్తామన్నారు. 119 నియోజక వర్గాలలో దళిత బంధు పథకాన్ని అమలు చేయకుండా, కేవలం ఒక హుజురాబాద్ లోనే అమలుచేయడంలో ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నించారు. దళిత బంధు లాగే ఎస్టీ బంధును కూడా అమలు చేయాలని కోరారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఆసరా పింఛన్లను లబ్దిదారులకు అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఎమ్మెల్యేలు ఆరోపించారు. 

Also Read: KTR Review Meet: హైద‌రాబాద్ నగర అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ కీల‌క ప్రక‌ట‌న‌.. 31 ప్రాంతాల్లో ఎస్‌టీపీల ఏర్పాటు... రాబోయే ప‌దేళ్ల అవ‌స‌రాల‌ దృష్ట్యా సీవ‌రేజి ప్లాంట్లు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి