ఈ నెల 24న మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. ఈ సారి మూడు రోజుల పాటు హస్తినలోనే ఉండనున్నట్టు తెలుస్తోంది. కేంద్రం హోంమంత్రి అమిత్‌షాతో పాటు పలువురు కేంద్రమంత్రులతో సీఎం భేటీ కానున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేసీఆర్ సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశం మొదటి రోజు వాయిదాపడ్డ తర్వాత రేపు మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇటీవల హస్తినలో వారం రోజుల పాటు ఉన్నారు. ఇప్పుడు మరో సారి ఢిల్లీకి వెళ్లడంపై సర్వత్రా ఆసక్తి రేపుతోంది.
ఈనెల 26న ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో హోంశాఖ మంత్రి అమిత్‌షా నేతృత్వంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశం జరగనుంది. ఇందులో ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సీఎంలు పాల్గొననున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనులను సమీక్షించనున్నారు. ఈ అంశాలపై కేంద్ర హోంశాఖ మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశం ఏర్పాటు చేసింది.
ఇటీవలే కేసీఆర్ ఢిల్లీ వెళ్లి వచ్చారు. మరోసారి హస్తిన పయనమవుతున్నారు. ఈ నెల 1న కేసీఆర్ఢిల్లీకి వెళ్లారు. దేశ రాజధానిలో టీఆర్ఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సీఎం.. ఆ పనుల నిమిత్తం ఢిల్లీకి వెళ్లారు. 3 రోజుల పాటు పర్యటించాలి అనుకుంటే.. పలు కార్యక్రమాల దృష్ట్యా వారం రోజులపాటు అక్కడే ఉండిపోయారు.
2వ తేదీన ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఈనెల 3న ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పది అంశాలపై విడివిడిగా పది లేఖలు అందజేశారు. యాదాద్రి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రావాల్సిందినగా మోడీని కేసీఆర్ ఆహ్వానించారు. ఆ తర్వాత కేంద్ర హోంమత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులతోనూ కేసీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావల్సిన నిధులపై చర్చించారు.
ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సీఎం.. ఆ పనుల నిమిత్తం సెప్టెంబర్ 1న ఢిల్లీకి వెళ్లారు. అక్కడ కేవలం 3 రోజుల పాటు బస చేయాలని భావించిన కేసీఆర్.. పలు కార్యక్రమాల దృష్ట్యా వారం రోజులపాటు అక్కడే ఉన్నారు. 2న ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఈ నెల 3న ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు.
Also Read: TSRTC News: ఆర్టీసీకి 4 నెలలు టైం ఇచ్చిన కేసీఆర్.. లేదంటే ఇక అదే జరుగుతుందని హెచ్చరిక