తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కోవిడ్ నిబంధనల ప్రకారం సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే శాసనసభ, మండలి అక్టోబర్‌ 1 వరకు కొనసాగే అవకాశముంది. సభ జరిగే తేదీలు, ఎజెండా తదితరాలపై శుక్రవారం సభ వాయిదా పడిన తర్వాత స్పీకర్ నేతృత్వంలో జరిగే బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ భేటీలో నిర్ణయిస్తారు. శుక్రవార అసెంబ్లీ సమావేశమైన తర్వాత ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులు, మండలి సభ్యుల మృతికి సంతాపం ప్రకటించి వాయిదా పడుతుంది. Also Read : తెలంగాణ గీత దాటింది ..జరిమానా విధించండి.. కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ


శని, ఆదివారాల్లో విరామం తర్వాత తిరిగి ఈ నెల 27 నుంచి అసెంబ్లీ ప్రారంభమవుతుంది. వరుసగా ఐదు రోజుల పాటు సభలు సాగే అవకాశముంది. శాసనమండలికి ప్రొటెమ్‌ చైర్మన్‌ హోదాలో భూపాల్‌రెడ్డి తొలిసారి సమావేశాలను నిర్వహించనున్నారు. మార్చిలో జరిగిన ఎన్నికలో పట్టభద్రుల కోటాలో ఎన్నికైన సురభి వాణీదేవి తొలిసారిగా మండలిలో అడుగు పెట్టనున్నారు. అలాగే రెండో సారి ఎన్నికైన  పల్లా రాజేశ్వర్‌రెడ్డి కొత్తగా పదవి కాలం ప్రారంభించనున్నారు.  నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ నుంచి ఎన్నికైన నోముల భగత్‌ కూడా తొలిసారి ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగు పెట్టనున్నారు.


Also Read : మరోసారి ఢిల్లీకి తెలంగాణ సీఎం కేసీఆర్.. అమిత్ షా తో భేటీ 


అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా "దళితబంధు"కు చట్టబద్ధ్దత కల్పించే బిల్లుతో పాటు మరో ఏడు బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశముంది. కొన్ని ఆర్డినెన్స్‌లకు చట్టబద్ధ్దత కల్పించే బిల్లులు కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్ోతంది. ధాన్యం కొనుగోలు, నదీ జలాల వివాదం, దళితబంధు పథకం, ఉద్యోగాల భర్తీ, సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన వంటి అంశాలు సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశముంది. ప్రతి పక్షాలు ఏ అంశం లేవనెత్తినా చర్చించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.Also Read : ఆర్టీసీకి 4 నెలలు టైం ఇచ్చిన కేసీఆర్.. లేదంటే ఇక అదే జరుగుతుందని హెచ్చరిక


అసెంబ్లీ సమావేశాలను కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.  పోలీస్, మీడియా, అధికారులు, శాసనసభ, మండలి సభ్యుల వెంట వచ్చే సహాయ సిబ్బందిని పరిమిత సంఖ్యలో అనుమతించాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు, పోలీసులు, మీడియా ప్రతినిధులు కోవిడ్‌ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలన్న గత నిబంధనను పాక్షికంగా సడలించారు.  పరీక్షలు చేయించుకునేందుకు వీలుగా అసెంబ్లీ ఆవరణలో కరోనా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు వ్యాక్సినేషన్‌ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి అవసరమైన వారికి తొలి, రెండో దశ కోవిడ్‌ టీకాలు ఇస్తారు. Also Read : పేపర్ ఏస్తే తప్పేంటి.. కష్టపడితేనే ఫ్యూచర్ సూపరుంటది.. పేపర్ బాయ్ మాటలకు కేటీఆర్ ఫిదా


 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.