జగిత్యాల టౌన్ లో ఓ పేపర్ బాయ్ మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి. అతడి పేరు జై ప్రకాశ్ ప్రభుత్వ పాఠాశాల్లో చదువుతున్నాడు. ఆ అబ్బాయి మాట్లాడే మాటలు ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. రోడ్డు మీద వెళ్లే ఎవరో వ్యక్తి.. ఆ ప్రకాశ్ కి సంబంధించిన వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అతడికి సంబంధించిన వీడియోను చూసిన కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ బాలుడి కాన్ఫిడెన్స్ ని మెచ్చుకున్నారు. వీడియో తీస్తున్న వ్యక్తి అడుగుతున్న ప్రశ్నలకు ఎంతో ధైర్యంగా సమాధానం చెప్పాడు.
వీడియో తీసే వ్యక్తి: ఏ స్కూల్ నీది?
పేపర్ బాయ్ ప్రకాశ్: గవర్నమెంట్ హైస్కూల్ నాది. ఇక్కడే ఓల్డ్ హై స్కూల్.
వీడియో తీసే వ్యక్తి: మరి ఈ ఏజ్ లో పేపర్ వేస్తున్నావ్?
పేపర్ బాయ్ ప్రకాశ్: ఏ ఎందుకు.. పేపర్ ఏయ్యోద్దా?
వీడియో తీసే వ్యక్తి: అంటే చదువుకునే ఏజ్ ఇలా పేపర్ ఏస్తున్నావెందుకు?
పేపర్ బాయ్ ప్రకాశ్: చదువుకుంటున్న పేపర్ ఏస్తున్న.. దాంట్లో ఏమన్న తప్పుందా?
వీడియో తీసే వ్యక్తి: అంటే ఇప్పుడు ఇలా కష్టపడుతున్నావ్ కదా బాగా నచ్చింది నాకు.
పేపర్ బాయ్ ప్రకాశ్: ఇప్పుడు కష్టపడితేనే.. భవిష్యత్ లో బాగుంటుంది.
జై ప్రకాశ్ చెప్పిన మాటలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మంత్రి కేటీఆర్ సైతం మురిసిపోయారు. శ్రీ ప్రకాశ్ కి సంబంధించిన వీడియో తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
'ఈ అబ్బాయి ప్రభుత్వ విద్యార్థి జై ప్రకాశ్. అతడి విశ్వాసం, ఆలోచన, చెప్పే విధానం చూస్తుంటే ముచ్చటేస్తుంది. చదువుతున్నప్పుడు పని చేయడంలో తప్పేంటని చెప్పాడు. అతడు భవిష్యత్ లో మంచి స్థితిలో ఉంటాడు.' అంటూ జై ప్రకాశ్ కి సంబంధించిన వీడియో ట్వీట్ చేశాడు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.