హీరో రాజ్ తరుణ్ హిట్.. ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా అతడితో వెండితెరకు పరిచయం చేసి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై.. మరో చిత్రంతో అలరించేందుకు సిద్ధమైపోతున్నాడు. ‘అనుభవించు రాజా’ అంటూ మరోసారి గోదావరి జిల్లా యువకుడిగా ఆకట్టుకోడానికి వచ్చేస్తున్నాడు. గురువారం.. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను హీరో రామ్ చరణ్ విడుదల చేశారు. 


బీమవరంలో జరిగే కోడి పందేలతో ఈ ట్రైలర్ మొదలైంది. ‘‘బంగారం గాడు ఊర్లోని.. వాడి పుంజు బరిలో ఉండగా.. ఇంకోడు గెలవడం కష్టమెహే’’ అనే డైలాగ్‌తో రాజ్ తరుణ్ క్యారెక్టర్‌ను పరిచయం చేశారు. దీన్ని బట్టి.. ఈ చిత్రం కోడి పందాల నేపథ్యంలో సాగే కథగా కనిపిస్తోంది. అలాగే.. ఇందులో రాజ్ తరుణ్ క్యారెక్టర్‌‌ను చాలా ఫన్నీగా చూపించారు. గోదారి కుర్రాళ్ల యాస.. బాడీ లాంగ్వేజ్‌ను ప్రదర్శించడం రాజ్ తరుణ్‌కు కొట్టిన పిండి. డైలాగులు కూడా చాలా క్యాచీగా ఉన్నాయి. ‘‘నీ బాధ నాకు అర్థమైందే.. నువ్వు గెలిచి నా పరువు కాపాడితే.. సాయంత్రం నీ గంప కింద నాలుగు పెట్టలు పెడతా’’ అంటూ కోడి పుంజులో కూడా కోరికలు పుట్టించి గెలుపు కోసం తాపత్రయం పడుతున్నట్లుగా ఈ టీజర్‌లో చూపించారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్లపై సుప్రియా యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీను గవిరెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. అయితే, ఈ సినిమా రిలీజ్ డేట్ మాత్రం ఇంకా ప్రకటించలేదు. 


‘అనుభవించు రాజా’ టీజర్: 






Also Read: ‘నాగార్జున’ అనేసి నాలుక కరుచుకున్న సమంత.. ఆ తర్వాత ‘మామ’ అంటూ ట్వీట్, సామ్‌కు ఏమైంది?


Also Read: ప్రభుత్వం ఆధీనంలో సినిమా టికెట్లు.. లాభం ఎవరికీ? ఇక బెనిఫిట్ షోలు ఉండవా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి