అత్యాచారాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలతోనైనా కామాంధులకు కనీసం కనువిప్పు కలగకపోవడం విస్మయం కలిగిస్తోంది. తాజాగా ఓ దివ్యాంగురాలు అత్యాచారానికి గురైంది. అధికార పార్టీకి చెందిన ఓ కార్యకర్తే ఈ దారుణానికి ఒడిగట్టడం గమనించదగ్గ విషయం. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా గూడెంకొత్త వీధి మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది.


Also Read: మటన్ ముక్కలు వేయలేదని చంపేశాడు.. సంగారెడ్డిలో దారుణం..


విశాఖపట్నం జిల్లా గూడెంకొత్తవీధి మండలం సీలేరులో ఓ దివ్యాంగురాలిపై వైసీపీ నాయకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. సీలేరుకు చెందిన 30 ఏళ్ల దివ్యాంగురాలికి కొద్ది కాలం క్రితం వివాహం జరిగింది. కానీ, కొద్ది రోజులకే భర్త ఆమెను వదిలేశాడు. దీంతో ఆమె తన తల్లి వద్దే ఉంటూ అక్కడే చిరు వ్యాపారం చేసుకుంటోంది. వారం క్రితం ఈ దివ్యాంగురాలి సోదరుడికి అనారోగ్యం రావడంతో ఆస్పత్రిలో చేర్పించేందుకు తల్లి తల్లి విజయనగరం తీసుకెళ్లింది. దీంతో ఆ దివ్యాంగురాలు ఇంట్లో ఒంటరిగా ఉంది. సోమవారం నాడు అర్ధరాత్రి ఇంటి బయట ఉన్న బాత్రూంకి దివ్యాంగురాలు వెళ్లింది. దీంతో అక్కడే కాపుకాసిన వైసీపీ గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు నాళ్ల వెంకటరావు ఆమెపై దాడి చేశాడు. వెంటనే చున్నీతో నోరు మూసి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయటకు చెప్పొద్దని హెచ్చరించి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 


బుధవారం నాడు సోదరుడిని ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకొని వచ్చిన బాధితురాలి తల్లికి విషయం తెలియడంతో ఇద్దరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల కోసం విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తరలించారు. నిందితుడిపై ఐపీసీ 376, దివ్యాంగుల సెక్షన్‌ కింద కేసులు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. అంతేకాక, నిందితుడిని అదుపులోకి కూడా తీసుకున్నట్లు చెప్పారు. తెలిపారు. వెంకటరావును అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.


Also Read: పాపం.. ఆ బుడ్డోడి కుటుంబానికి మరో కష్టం.. నగదు చోరీ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు


నిందితుడిపై చర్యలేవన్న మాజీ ఎమ్మెల్యే
అధికార పార్టీలోని కిందిస్థాయి నేతలు తమ పార్టీ నాయకులపై ఉన్న కేసులను చూసుకొని కింది స్థాయి నేతలు కూడా ఆడబిడ్డల జీవితాలతో చెలగాటమాడుతున్నారని రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు, పాయకరావుపేటమాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఆరోపించారు. విశాఖపట్నం జిల్లా సీలేరులోని దివ్యాంగురాలిపై అధికార పార్టీ నేత అత్యాచారానికి పాల్పడితే ఇంకా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. వైసీపీ నేత వెంకటరావుపై పోలీసులు తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వ వైఫల్యానికి ఇది నిదర్శనమని బుధవారం వంగలపూడి అనిత అన్నారు.


Also Read: ఇక్కడ పోలీసులకు చెప్పి మరీ కిడ్నాప్‌లు చేస్తారు.. కేసులు కూడా ఉండవు, 11 గంటల తర్వాత..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.