ఇటీవల 8 ఏళ్లు బుడ్డోడు ఎలక్ట్రానిక్ ఆటో నడుపుతూ కుటుంబ బారాన్ని మోస్తున్నాడని కథనాలు రావడంతో ఆ కుటుంబ పరిస్థితి ఏపీ ప్రజలందరికీ తెలిసింది. అయితే తాజాగా ఆ కుటుంబం మరోసారి వార్తల్లో నిలిచింది. తమ కష్టాలు కొంతయినా తీరాయనుకంటే వారి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. కుటుంబ పెద్ద, అతడి భార్య అంధులు అని తెలిసి భారీగా నగదు చోరీకి గురవడంతో తమ గోడును వెల్లబోసుకున్నాడు ఆ వ్యక్తి. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం గంగుడుపల్లికి చెందిన ఆ అంధుడు నగదు చోరీపై పోలీసులను ఆశ్రయించాడు. 


బండి పాపిరెడ్డి పుట్టుకతో అంధుడు. అతడి భార్య రేవతికి సైతం చూపులేదు. వీరికి పదేళ్ల కిందట వివాహం అయింది. ఆ దంపతులకు సంతానం ముగ్గురు కుమారులు. పెద్ద కొడుకు గోపాలకృష్ణారెడ్డి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. మరో ఇద్దరు కుమారులు హిమవంతురెడ్డి, గణపతిరెడ్డి ఉన్నారు. పెద్దవాడైన గోపాలకృష్ణ ఇటీవల ఎలక్ట్రానిక్ ఆటో నడుపుతున్న వీడియో వైరల్ అయింది.


పాపిరెడ్డి కుటుంబ పరిస్థితి చూసి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చలించిపోయారు. వార్తా కథనాలు చూసిన ఆయన మొదటగా రూ.20 వేల రూపాయలు తక్షణ ఆర్థిక సహాయం అందించారు. అనంతరం టీడీపీ నేతల ద్వారా మరో రూ.80 వేలు అందించి పాపిరెడ్డి కుటుంబాన్ని ఆదుకున్నారు. ఈ నగదును పెట్టెలో పెట్టగా, ఎవరో చోరీ చేశారు. తన ఇంట్లో రూ. 80 వేలు చోరీ జరిగిందని చంద్రగిరి పోలీసులను ఆశ్రయించాడు. పీఎస్‌కు వెళ్లి చోరీపై ఫిర్యాదు చేసి తనకు న్యాయం చేయాలని కోరాడు. Also Read: కుటుంబ భారం మోస్తున్న చిన్నారి... ఆటో రిక్షా నడుపుతూ కుటుంబ పోషణ... ఆదుకుంటామని నారా లోకేశ్ హామీ


సెప్టెంబర్ 21వ తేదీన పాపిరెడ్డి భార్య పుట్టింటికి వెళ్లగా, తన ముగ్గురు కుమారులతో పాపిరెడ్డి ఇంట్లోనే ఉన్నాడు. ఆరోజు అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి పెట్టెలో దాచిన రూ.80 వేల మొత్తాన్ని ఎవరో చోరీ చేశారు. ఉదయం పూట ఇంట్లో తిరుగుతుంటే కాలికి ఫోన్ తగిలిందని పాపిరెడ్డి చెప్పాడు. ఇది తమ ఫోన్ కాదని పాపిరెడ్డి పిల్లలు తండ్రికి చెప్పారు. వెంటనే అనుమానం వచ్చి పెట్టె తెరిచి పరిశీలించగా నగదు చోరీకి గురైనట్లు గుర్తించాడు. డబ్బు లేదని చిన్నారులు కూడా తండ్రికి చెప్పారు. ట్రంకు పెట్టెలో నగదు చోరీకి వచ్చిన వారు కంగారులో సెల్ ఫోన్ ఇంట్లోనే పడేసుకున్నారని పోలీసులకు వివరించాడు. తన ఇంట్లో దొరికిన మొబైల్ ను సైతం పోలీసులకు అందజేశాడు. నిందితున్ని పట్టుకొని డబ్బులు రికవరీ చేసి న్యాయం చేస్తామని ఎస్ఐ విజయ్ కుమార్ బాధితుడు పాపిరెడ్డికి హామీ ఇచ్చారు. 


అనంతపురం పెన్షన్‌దారుల్లో టెన్షన్.. ఒక్క నెలలో 20 వేల పింఛన్లు ఔట్.. వచ్చే నెలలోనూ ఇంతేనా?


నారా లోకేష్ ఇటీవల ఏమన్నారంటే..
ఎనిమిదేళ్ల బాలుడు కుటుంబానికి చేదోడుగా ఉండేందుకు ఆటో నడపడంపై ఇటీవల టీడీపీ జాతీయ‌ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేష్ స్పందించారు. బ్యాట‌రీ ఆటో కోసం చేసిన అప్పు తీర్చేందుకు టీడీపీ రూ.2 ల‌క్షలు ఆర్థిక సాయం అందించ‌నుంద‌ని వెల్లడించారు. గోపాలకృష్ణారెడ్డి కోరిక మేర‌కు ఏ స్కూల్లో చ‌దవాల‌నుకుంటే అక్కడ విద్యాభ్యాసానికి అయ్యే మొత్తం ఖ‌ర్చు భ‌రిస్తామ‌ని ట్విట్టర్ ద్వారా లోకేష్ ప్రక‌టించారు. మొదట రూ.20 వేలు తక్షణ సాయం అందజేసిన లోకేష్ ఆపై మరో 80 వేల రూపాయలు పాపిరెడ్డి కుటుంబానికి అందజేయగా ఆ నగదును ఎవరో చోరీ చేశారు. చిన్నారులపై వేధింపులను అరికట్టేందుకు పోక్సోను మించిన చట్టం ! ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ కీలక ప్రకటన


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి