ఆంధ్రప్రదేశ్‌లో ఆడపిల్లలను వేధించే , హింసించే తండ్రులను కఠినంగా శిక్షించేందుకు పోక్సో కంటే కఠినమైన చట్టాన్ని తీసుకు రావాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ప్రకటించారు. ప్రస్తుతంలో తండ్రులు కుమార్తెలను వేధిస్తున్న, హింసిస్తున్న కేసులు ఆందోళన కరంగా పెరిగిపోయాయని ఆమె అభిప్రాయ వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్‌గా దృష్టి పెట్టిందని తెలిపింది. ఏపీ మహిళా కమిషన్ కుటుంబంలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులపై దృష్టి చట్టం తేవాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పోషణ్ అభియాన్‌లో భాగంగా పోషణ్ మా అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. Also Read: డిసెంబర్ నుంచి గ్రామ సచివాలయాల తనిఖీ.. సీఎం జగన్ కీలక నిర్ణయం
ఈ కార్యక్రమాన్ని విజయవాడ సబ్ జైల్లో మహిళా ఖైదీలకు ప్రారంచిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో మహిళల భద్రత చాలా మెరుగ్గా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే రాజకీయు పార్టీలు కొన్ని కొన్ని అంశాలను రాజకీయం చేస్తూ బుదరచల్లే ప్రయత్నం చేస్తున్నాయని అందరి కలసి కట్టుగా పోరాడితేనే మహిళలపై వేధింపులు ఆగుతాయని ఆమె వ్యాఖ్యానించారు. మహిళలపై వేధింపులు అరికట్టడంలో మహిళా కమిషన్ చాలా చురుగ్గా వ్యవహరిస్తోందని.. విద్యార్థినుల్లో అవగాహన పెంచేందుకు ఈ నారి పేరుతో వెబినార్స్ కూడా యూనివర్శిటీల్లో కండక్ట్ చేస్తున్నట్లుగా ఆమె తెలిపారు. Also Read: 50 మంది టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులకు షాక్ .. జీవోను సస్పెండ్ చేసిన హైకోర్టు
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే మహిళలపై అఘాయిత్యాలను ఎదుర్కోవడానికి దిశ చట్టం తీసుకు వచ్చారు. ప్రస్తుతం ఆ చట్టం కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంది. ఇంకా రాష్ట్రపతి సంతకం కాలేదు. అయినప్పటికీ దిశ కార్యక్రమం పేరుతో పోలీస్ స్టేషన్లు, యాప్‌లు నిర్వహిస్తున్నారు. దిశ చట్టం అమల్లో ఉందన్నట్లుగా హోంమంత్రితో సహా పోలీసు ఉన్నతాధికారులు ప్రకటనలు చేయడంతో రాజకీయంగా కూడా వివాదాస్పదమవుతోంది. అయితే దిశ మహిళలను రక్షిస్తోందని.. మహిళా కమిషన్ చైర్మన్ చెబుతున్నారు.Also Read: నార్కో టెస్టులకు కోర్టు నో ! ఆయేషా మీరా కేసులో సీబీఐకి కోర్టు షాక్ !
దేశంలో చిన్నారులపై లైంగిక నేరాలకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పోక్సో చట్టమే ఇప్పటికి అత్యంత కఠినంగా ఉంది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఇంతకు మించిన కఠినమైన చట్టాన్ని తీసుకు వస్తామని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఆ చట్టం దిశను మించి ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఇంత వరకూ దిశ చట్టాన్నే ఆమోదింపచేసుకోలేకపోయారు ఇక కొత్తగా పోక్సోను మించి తీసుకొచ్చే చట్టాన్ని ఎలా ఆమోదింప చేసుకుంటారని విపక్షాలు ప్రశ్నించే అవకాశం ఉంది. దీనికి ప్రభుత్వం చట్టంతోనే సమాధానం చెప్పే్ అవకాశం ఉంది.