గణితంలో 1 నుంచి 10 వరకు ఉన్న అన్ని సంఖ్యల ద్వారా ఏ సంఖ్యనూ విభజించలేం. కానీ ఈ ఒక్క సంఖ్య మాత్రం చాలా వింతగా ఉంటుంది. ఇది చూసి ప్రపంచంలో గణిత శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఈ సంఖ్యను గుర్తించిన భారతీయ గణిత శాస్త్రవేత్తలు తెలివితేటలకు సాహో అనకుండా ఉండలేకపోయారు. ఇంతకీ ఆ సంఖ్య ఏంటంటే 2520. ఇది చాలా నంబర్లలో ఒకటి కావొచ్చు కానీ గణిత శాస్త్రవేత్తల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించిన నంబర్ ఇది. ఎందుకంటే ఇది 1 నుంచి 10 వరకూ ఏ నంబర్ తో అయినా విభజించవచ్చు. అది సరి అయినా, బేసి అయినా అంటే ఈవెన్ నంబర్ అయినా ఆడ్ నంబర్ అయినా శేషం సున్నానే వస్తుంది. ఇది నిజంగా అద్భుతం, అసాధ్యం అనిపిస్తుంది.
2520 నంబర్ ప్రత్యేకతను ప్రాక్టికల్ గా చూస్తే 2520/1= 25202520/2= 12602520/3= 8402520/4= 6302520/5= 5042520/6= 4202520/7= 3602520/8= 3152520/9= 2802520/10= 252
Also Read: తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు వానలే వానలు..పలుజిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు
కేవలం ఈ ఒక్క ప్రత్యేకత మాత్రమే కాదు ఈ నంబర్ కి మరో విశేషం ఉంది. అదేంటంటే (7*30*12) ఈ మూడింటిని గుణిస్తే వచ్చే ఆన్సర్ ఇదే. ఇందులో ప్రత్యేకత ఏంటంటే హిందూ సంవత్సరానికి సంబంధించివారానికి రోజులు =7నెలకి రోజులు = 30ఏడాదికి నెలలు = 12ఈ మూడు గణిస్తే 7*30=210...............210*12= 2520
Also Read: చిరంజీవి 43 ఏళ్లు సినీ జర్నీపై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ఇదంతా 20 వ శతాబ్దంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గణిత మేధావుల్లో ఒకరిగా పేరు సంపాందించిన భారతీయుడు శ్రీనివాస రామానుజన్ ప్రతిభే. తమిళనాడులో ఈరోడ్‌లోని ఓ నిరుపేద బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కోమలమ్మాళ్, శ్రీనివాస అయ్యంగార్ దంపతులకు 1887 డిసెంబరు 22 న రామానుజన్ జన్మించారు. చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభను ప్రదర్శించి ఆయిలర్ నియమాలు, త్రికోణమితికి చెందిన సమస్యలను సాధించారు. జీఎస్ కార్ రచించిన సినాప్సిస్ ఆఫ్ ప్యూర్ మ్యాథ్‌మెటిక్స్ అనే పుస్తకం శ్రీనివాస రామానుజన్‌లోని ప్రతిభను బయటకు తీసుకొచ్చింది. ఆ పుస్తకంలో ఆల్‌జీబ్రా, అనలిటికల్ జామెట్రీ లాంటి విషయాలకు సంబంధించిన 6165 సిద్ధాంతాలను నిరూపించడానికి పెద్ద పెద్ద ప్రొఫెసర్‌లు సైతం నానా తంటాలు పడేవారు. అయితే వారు అర్థం చేసుకోలేకపోయిన సూత్రాలకు రామానుజన్ ఎలాంటి పుస్తకాల సహాయం లేకుండా అలవోకగా పరిష్కరించేవారు.
Also Read: ఈ రాశుల వారు పెద్ద బాధ్యతలు తలకెత్తుకుంటారు, ఏ రాశిఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
ALso Read: పెరిగిన ఇంధన ధరలు.. ఇక్కడ భారీ తగ్గుదల, కొన్ని చోట్ల స్థిరం
Als Read: మరింత పెరిగిన పసిడి ధర.. హైదరాబాద్‌లో ఇంకా.. వెండి కూడా అదే దారిలో..