రామ్‌గోపాల్ వర్మ హఠాత్తుగా వరంగల్‌లో పర్యటించారు. వరంగల్‌లోని ఎల్బీ కళాశాల సిబ్బంది, అధ్యాపకులతో మాట్లాడారు. కొంత ప్రముఖులతోనూ గతంలో ఉండే గ్యాంగ్ వార్ తరహా రాజకీయాలపైనా మాట్లాడినట్లుగా తెలుస్తోంది. అలాగే రాయలసీమ జిల్లాల తరహాలో గతంలో వరంగల్‌లోనూ ఉండే ఘర్షణ పూరిత రాజకీయ వాతావరణాలు.. ఆ తరహాలో ఎదిగిన రాజకీయ నేతల గురించి కూడా వివరాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. ఆర్జీవీ హఠాత్తుగా ఇలా ఎందుకు చేస్తున్నారన్నపై వరంగల్‌లో జోరుగా చర్చ సాగుతోంది. ఆర్జీవీ దృష్టి ప్రస్తుతం కొండా మురళి, సురేఖ దంపతుల బయోపిక్‌పై పడిందని అందుకే వివరాలు సేకరిస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది. Also Read : హీరోయిన్‌గా వాణీ విశ్వనాథ్ కూతురు.. హీరో ఆయన కొడుకే!
ఆర్టీవీకి గ్యాంగ్ స్టర్ నేపధ్యమున్న వారి బయోపిక్‌లు తీయడమంటే ఎంతో ఇష్టం. దావూద్ లాంటి వారి బయోపిక్‌లను కూడా తీశాడు. పరిటాల రవి , మద్దెలచెర్వుల సూరి ఘర్షణను రక్త చరిత్ర పేరుతో తెరకెక్కించారు. ఇప్పుడు చేయడానికి సినిమాలు లేక మంచి బయోపిక్‌ల కోసం వెదుకుతున్నారేమో కానీ ఆయన కంటికి కొండా దంపతులు కనిపించినట్లుగా తెలుస్తోంది. కొండా మురళి, సురేఖల బ్యాక్ గ్రౌండ్ స్టోరీ కొత్తగా ఎవరైనా చెప్పారో లేక ఎక్కడైనా ట్విస్టులు తెలిశాయేమో కానీ ఆసక్తి చూపిస్తున్నట్లుగా భావిస్తున్నారు. Also Read: Chiranjeevi: చిరంజీవి గారు.. ఈ రీ‘మేకు’లు మాకొద్దు, మీ రేంజ్ ఏంటీ మీరు చేసే కథలేంటీ? అభిమాని లేఖ వైరల్
వరంగల్ రాజకీయాల్లో కొండా దంపతులకు ఓ ప్రత్యేకత ఉంది. కొండా మురళి క్యారెక్టర్‌లో ఆర్జీవీకి నచ్చే అంశాలు ఉన్నాయి. కొండా మురళి మొదట ఎర్రబెల్లి దయాకర్ రావు అనుచరుడిగా ఉండేవారు. తర్వాత ఆయనకే ఎదురు తిరిగారు. సొంతంగా ఎదిగారు. ఈ క్రమంలో ఆయనపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఎర్రబెల్లి టీడీపీలో ఉంటే ఆయనకు పోటీగా కొండా మురళిని వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రోత్సహించాడు. అయితే ఆయనపై ఉన్న ముద్ర కారణంగా ప్రజా జీవితంలోకి ఆయన భార్య కొండా సురేఖకు చాన్సిచ్చారు. పరోక్ష రాజకీయాల్లో కొండా మురళీ ఉండేవారు. ఎమ్మెల్సీ పదవి తీసుకునేవారు. ఇద్దరూ రాజకీయంగా రెబల్ గా ఉంటారు.
Also Read: Pornography Case: నన్ను కేసులో ఇరికించారు.. చివరికి సత్యమే గెలుస్తుంది.. నటి ఆవేదన
అయితే వారి ప్రాభవం వైఎస్ చనిపోయిన తర్వాత తగ్గిపోయింది. జగన్మోహన్ రెడ్డి పంచన చేరినా ఆయన మోసం చేశాడని బయటకు వచ్చేశారు. తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. అక్కడ వారిని పట్టించుకోలేదు. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నారు. ఎక్కడున్న వారి ఫైర్ బ్రాండ్ రాజకీయాలు వారు చేస్తూంటారు. అందుకే ఆర్జీవీకి వారి బ్యాక్ గ్రౌండ్ నచ్చినట్లుగా అందుకే బయోపిక్ తీసేందుకు పరిశీలన ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. తీస్తారో లేదో ఆయన ప్రకటించే వరకూ తెలియదు. కానీ ఆయన వరంగల్ పర్యటనలో సేకరిస్తున్న సమాచారం మొత్తం కొండా దంపతుల గురించే ఉంది. Also Read : జీవిత ప్రలోభ పెడుతోంది.. కమెడియన్ పృథ్వీరాజ్ ఫిర్యాదు, హీటెక్కిన ‘మా’ ఎన్నికలు