సినీ రంగంలో ప్రస్తుతం వారసుల ఎంట్రీ చాలా సాధారణంగా మారింది. కేవలం నటీనటులకు సంబంధించిన వారసులే కాకుండా.. దర్శకులు, సాంకేతిక నిపుణుల వారసులు కూడా తెరమీదకు వస్తున్నారు. సంగీత దర్శకుడు కోటి కుమారుడు రాజీవ్ సాలూరు ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తుండగా.. ఒకప్పటి గ్లామరస్ హీరోయిన్ వాణీ విశ్వనాథ్ కూతురు వర్ష విశ్వనాథ్ హీరోయిన్‌గా పరిచయం కానుంది.


ఇదే సినిమాలో కోటి కూడా ఓ ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు. టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్ పతాకంపై గాజుల వీరేష్ నిర్మాతగా, కిట్టు నల్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ప్రొడక్షన్ నెంబర్ 1’గా ఈ సినిమా తెరకెక్కుతోంది. షూటింగ్ ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి అయింది. రెండో షెడ్యూల్ కూడా వైజాగ్‌లో షూట్ చేస్తున్నారు. మెలోడీబ్రహ్మ మణిశర్మ సంగీత దర్శకుడిగా పనిచేస్తున​ ఈ సినిమాకి ఈశ్వర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. సదన్, లావణ్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.


Also Read: Chiranjeevi: చిరంజీవి గారు.. ఈ రీ‘మేకు’లు మాకొద్దు, మీ రేంజ్ ఏంటీ మీరు చేసే కథలేంటీ? అభిమాని లేఖ వైరల్


ఈ సినిమా నిర్మాత వీరేష్ మాట్లాడుతూ.. దర్శకుడు తమ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా చిత్రాన్ని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడని తెలిపారు. హీరో, హీరోయిన్స్‌ రాజీవ్, వర్ష మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ వర్కౌట్‌ అయిందని పేర్కొన్నారు. సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఎంతో ఎంటర్టైనింగ్‌గా తెరకెక్కిస్తున్నామని దర్శకుడు  కిట్టు మాట్లాడారు. ప్రేక్షకులకు నచ్చే ప్రతి అంశం ఈ చిత్రంలో ఉంటుందన్నారు. తనను నమ్మి దర్శకుడిగా అవకాశం ఇచ్చినందుకు నిర్మాత గాజుల వీరేష్‌కు ధన్యవాదాలు తెలిపారు. చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు.


మణిశర్మ మంచి బాణీలు అందిస్తే.. ఇద్దరు వారసులు నటిస్తున్న చిత్రంగా ఈ సినిమా మంచి అంచనాలు అందుకోగలదు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగుండి.. ప్రచారం విషయంలో జాగ్రత్త వహిస్తే.. సినిమా మీద హైప్ పెరిగే అవకాశం ఉంది.


Also Read: Telugu Movies in OTT, Theaters: రేపు ఓటీటీ, థియేటర్లలో సందడి చేసే చిత్రాలు ఇవే.. డోన్ట్ మిస్!


Also Read: Bigg Boss 5 Promo: తను మ్యారీడా, సెపరేటెడా, డివోర్స్ డా.. తనకే తెలియదంటున్న ప్రియ, హౌస్లో మొదటి ప్రేమను తలచుకుని అంతా ఎమోషనల్


Also Read: Pornography Case: నన్ను కేసులో ఇరికించారు.. చివరికి సత్యమే గెలుస్తుంది.. నటి ఆవేదన