టెక్నాలజీ పెరిగేకొద్దీ మనదేశంలో సైబర్ దాడులు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఎంత కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని సృష్టించినా.. దాన్ని ఛేదించే సైబర్ నేరగాళ్లు ఉంటూనే ఉన్నారు. ఇప్పుడు మనదేశంలో కొత్త ట్రోజన్ మాల్‌వేర్ వెలుగు చూసింది. ఆండ్రాయిడ్ ఫోన్లు ఉపయోగించే బ్యాంకు వినియోగదారులే ఈ ట్రోజన్ లక్ష్యం. భారతదేశ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ దీనికి సంబంధించిన అడ్వైజరీని కూడా విడుదల చేసింది.


‘ఇన్‌కం ట్యాక్స్ రీఫండ్’ పేరుతో ఈ మెసేజ్‌లో హానికరమైన ఫిషింగ్ మాల్‌వేర్ ఉంది. వినియోగదారుల సెన్సిటివ్ డేటాను ఇది లీక్ చేస్తుంది. దీని కారణంగా పెద్ద స్థాయిలో సైబర్ దాడులు, ఆర్థికపరమైన మోసాలు జరిగే అవకాశం ఉందని సెర్ట్‌ఇన్ మంగళవారం జారీ చేసిన అడ్వైజరీలో పేర్కొంది. కాబట్టి ఇలాంటి మెసేజ్ ఏదైనా కనిపిస్తే.. అస్సలు క్లిక్ చేయకండి.


Also Read: Realme GT Neo 2: రియల్‌మీ సూపర్ ఫోన్ వచ్చేసింది.. తక్కువ ధరలోనే సూపర్ ఫీచర్లు!


ఆండ్రాయిడ్ మొబైల్‌ను ఉపయోగించే భారతీయ వినియోగదారులే దీని లక్ష్యమని తెలిపారు. మొబైల్ బ్యాంకింగ్ క్యాంపెయిన్ తరహాలో కనిపించే ఈ ఆండ్రాయిడ్ మాల్‌వేర్‌కు దూరంగా ఉండాలని వినియోగదారులకు సూచించారు. డ్రినిక్ అనే పేరున్న ఆండ్రాయిడ్ మాల్‌వేర్‌ ఈ మెసేజ్‌ల్లో ఉంటోంది.


2016లో ఎస్ఎంఎస్‌ల్లో డేటాను దొంగిలించేందుకు దీన్ని రూపొందించినట్లు సెర్ట్‌ఇన్ తన అడ్వైజరీలో తెలిపింది. తర్వాత ఇది బ్యాంకింగ్ ట్రోజాన్‌గా మారింది. స్క్రీన్ ఫిషింగ్ చేస్తూ.. సెన్సిటివ్ బ్యాంకింగ్ సమాచారాన్ని ఇది నేరగాళ్లకు అందిస్తుంది. మొత్తంగా 27 పెద్ద ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులను ఇది లక్ష్యంగా చేసుకుందని సెర్ట్ఇన్ తెలిపింది.


ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ టీం లేదా సెర్ట్ఇన్‌ను సైబర్ దాడులపై పోరాడటమే లక్ష్యంగా ప్రభుత్వం స్థాపించింది. ఫిషింగ్, హ్యాకింగ్ దాడు, ఆన్‌లైన్ దాడుల నుంచి కాపాడటమే దీని లక్ష్యం. టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా ఇలాంటి దాడులు జరుగుతూనే ఉంటాయి. వీటి బారిన పడకుండా ఉండాల్సిన ఒకే ఒక్క పని.. మనం జాగ్రత్తగా ఉండటమే!


Also Read: Redmi Smart TV: రూ.16 వేలలోపే స్మార్ట్ టీవీ.. సూపర్ ఫీచర్లు, అదిరిపోయే డిస్‌ప్లే.. లాంచ్ చేసిన షియోమీ!


Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్‌లో ఆ ఫోన్ లేనట్లే.. యాపిల్ సంచలన నిర్ణయం!


Also Read: Realme New 5G Phone: రియల్‌మీ బడ్జెట్ 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. ధర రూ.15 వేలలోపే!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి