రియల్‌మీ వీ11ఎస్ స్మార్ట్‌ఫోన్ త్వరలో లాంచ్ కానుందని సమాచారం. బడ్జెట్ ధరలోనే 5జీతో ఈ ఫోన్ లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో చైనాలో లాంచ్ అయిన రియల్‌మీ వీ11 తరహాలోనే దీని స్పెసిఫికేషన్లు ఉండనున్నాయని తెలుస్తోంది. దీని డిజైన్ కూడా కొత్తగా ఉండనుంది. రియల్‌మీ వీ11లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో అందుబాటులో ఉంది.
చైనీస్ మైక్రోబ్లాగింగ్ ఫోరం వీబోలో దీనికి సంబంధించిన వివరాలను ప్రముఖ టిప్‌స్టర్ లీక్ చేశారు. దీన్ని బట్టి ఇందులో 128 జీబీ స్టోరేజ్ ఉండనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండనుంది. ఇందులో ఎల్సీడీ డిస్‌ప్లేను అందించనున్నట్లు తెలుస్తోంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్ లేదా 90 హెర్ట్జ్‌గా ఉండే అవకాశం ఉంది.
రియల్‌మీ వీ11 చైనాలో 1,199 యువాన్ల(సుమారు రూ.13,500) ధరతో లాంచ్ అయింది. ఇది 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. వైబ్రంట్ బ్లూ, క్వైట్ గ్రే రంగుల్లో ఈ ఫోన్ చైనా మార్కెట్లో ఎంటర్ అయింది. అయితే ఈ ఫోన్‌ను రియల్‌మీ మనదేశంలో లాంచ్ చేయలేదు. బడ్జెట్ 5జీ ఫోన్లకు మనదేశంలో డిమాండ్ పెరుగుతుంది కాబట్టి త్వరలో దీన్ని మనదేశంలో కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది.
రియల్‌మీ వీ11ఎస్ కూడా లోబడ్జెట్‌లోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. రియల్‌మీ వీ11 5జీలో 6.52 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. దీని ద్వారా ఫోన్‌ను 0.3 సెకన్లలో అన్‌లాక్ చేయవచ్చు. ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ సపోర్ట్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
5జీ, డ్యూయల్ 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ కనెక్టివిటీ ఫీచర్లను కంపెనీ ఇందులో అందించింది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.84 సెంటీమీటర్లు కాగా, బరువు 186 గ్రాములుగా ఉంది.
Also Read: Xiaomi 11 Lite 5G NE: షియోమీ కొత్త 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. సెప్టెంబర్ 29న లాంచ్.. ధర ఎంత ఉండవచ్చంటే?
Also Read: Nokia G10: కొత్త ఫోన్ లాంచ్ చేసిన నోకియా.. ధర రూ.13 వేలలోపే.. జియో యూజర్లకు స్పెషల్ ఆఫర్స్!
Also Read: iPhone 13: ఐఫోన్ 13 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం.. కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్!