కరోనా తగ్గుముఖం పట్టడంతో నిబంధనలకు అనుగుణంగా థియేటర్లలో సినిమాలు విడుదలచేస్తున్నారు. అయినప్పటికీ కొన్ని చిత్రాలు ఓటీటీకే సై అంటున్నాయి. అయితే థియేటర్లలో శుక్రవారం సెంటిమెంట్ ఓటీటీలోనూ కొనసాగుతోంది.
‘లవ్‌స్టోరీ’: ఎప్పటి నుంచో సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘లవ్ స్టోరీ’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ఈ రొమాంటిక్ మూవీ ఏప్రిల్‌లో విడుదల కావాల్సినా కరోనా కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత వినాయకచవితి కానుకగా వస్తుందని ప్రకటించినా చివరి నిముషంలో విడుదల తేదీ మార్చారు. ఎట్టకేలకు సెప్టెంబరు 24న ‘లవ్‌స్టోరీ’ విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ సినిమా పై భారీ అంచనాలే పెంచేశాయి. అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వేంకటేశ్వర సినిమాస్ పతాకంపై నారంగ్ దాస్, పుష్కర్ రామ్‌మోహన్‌లు నిర్మించిన ‘లవ్‌స్టోరీ’కి పవన్ సీహెచ్ సంగీత దర్శకుడు.
‘మరో ప్రస్థానం’: తనీశ్, ముస్కాన్ సేథి ప్రధాన పాత్రల్లో నటించిన ‘మరో ప్రస్థానం’ కూడా సెప్టెంబరు 24న విడుదలకానుంది. స్ట్రింగ్ ఆపరేషన్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ ఇది. ఓంకారేశ్వర క్రియేషన్స్, మిత్ర మీడియా సంస్థలు నిర్మించిన ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించాడు.
‘సిండ్రెల్లా’: ఐటెం సాంగ్స్ తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన రాయ్ లక్ష్మి లేటెస్ట్ మూవీ ‘సిండ్రెల్లా’. ఎస్‌జే సూర్య సహాయకుడిగా వినో వెంకటేశ్ దర్శకత్వం వహించిన ఈ హారర్ సినిమాలో రాయ్ లక్ష్మి మూడు భిన్న పాత్రల్లో నటిస్తోంది. ఈ సినిమా సెప్టెంబరు 24న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.
‘జంగిల్ క్రూయిజ్’: డ్వేన్ జాన్సన్, ఎమిలి బ్లంట్, ఎడ్గర్ రమీజ్, జాక్ వైట్ హాల్ కీలక పాత్రల్లో నటించిన అడ్వెంచర్ ఫాంటసీ ఫిల్మ్ ‘జంగిల్ క్రూయిజ్’. జైము కొల్లెట్ సెరా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిందా పడింది. ఈ ఏడాది జులైలో అమెరికాలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు భారతీయ ప్రేక్షకులన అలరించేందుకు సిద్ధమైంది. సెప్టెంబరు 24న అన్ని భారతీయ భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.
ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లు:
‘పరిణయం‘: దుల్కర్ సల్మాన్, కల్యాణి ప్రియదర్శన్ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ డ్రామా ‘వరునె అవశ్యముంద్’. అనూప్ సత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గతేడాది ఫిబ్రవరిలో మలయాళంలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. సురేశ్‌గోపి, శోభన కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. ఇప్పుడీసినిమా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. ప్రముఖ ఓటీటీ ‘ఆహా’ లో ‘పరిణయం’ పేరుతో సెప్టెంబరు 24నుంచి స్ట్రీమింగ్ కానుంది.
‘ఆకాశవాణి’: రాజమౌళి వద్ద సహాయకుడిగా పనిచేసిన అశ్విన్ గంగరాజు రూపొందించిన సినిమా ‘ఆకాశవాణి’. పద్మనాభరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి తనయుడు కాలభైరవ సంగీత దర్శకుడు. వాస్తవానికి ఈ సినిమా థియేటర్‌లో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ సోనీ లివ్ వేదికగా సెప్టెంబరు 24న స్ట్రీమింగ్ కానుంది.
‘పీఎం మోదీ బయోపిక్’: బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటించిన ‘పీఎం నరేంద్ర మోదీ’ ఓటీటీలో సెప్టెంబరు 23 నుంచి ఎంఎక్స్ ప్లేయర్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2019 మే 24 విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో వివేక్‌తో పాటు బొమన్ ఇరానీ, మనోజ్ జోషి, జరీనా వాహబ్, రాజేంద్ర గుప్తా వంటి వారు కీలక పాత్రలు పోషించారు.
అమెజాన్ ప్రైమ్ వీడియో
రామే అందాళుమ్- సెప్టెంబరు 24
బర్డ్స్ ఆఫ్ ప్యారడైజ్ - సెప్టెంబరు 24
గోలియత్ - సెప్టెంబరు 24
డెస్పికబుల్ మి - సెప్టెంబరు 25
Also read: హేయ్.. మళ్లి ఏసేశాడు! మహేశ్ బాబు-సమంత 'దూకుడు'కి పదేళ్లు..
నెట్‌ఫ్లిక్స్
ఇంట్రూజన్ -సెప్టెంబరు 22
మిడ్‌నైట్ మాస్-సెప్టెంబరు 24
కోటా ఫ్యాక్టరీ2 -సెప్టెంబరు 24 (వెబ్‌సిరీస్)
జీ5
అలాంటి సిత్రాలు -సెప్టెంబరు 24
Also Read: చిరంజీవి 43 ఏళ్లు సినీ జర్నీపై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
Also Read: ‘అనుభవించు రాజా’ టీజర్.. హథవిధీ! కోడిపుంజుకు కూడా కోరికలు పుట్టిస్తున్నాడు