సెలబ్రెటీలు విలాసవంతమైన కార్లు కొనుగోలు చేయడమే కాదు వాటికోసం సెలెక్ట్ చేసే నంబర్ల విషయంలోనూ తగ్గేదేలే అంటారు. కొట్లు పెట్టిన కొన్న కారుకి లక్షలైనా వెచ్చించి తమకు కావాల్సిన నంబర్ దక్కించుకుంటారు. ఎందుకంటే విలువైన కార్లకు మరింత లుక్ ఇచ్చేది ఫ్యాన్సీ నంబరే అని వారి ఫీలింగ్. అయితే చాలామంది తమ లక్కీ నంబర్ కారు నంబర్ గా వచ్చేలా ప్లాన్ చేసుకుంటారు. అందుకోసం  పెద్ద మొత్తంలో ఖర్చు చేయడానికి కూడా వెనుకాడరు. ఇందులో భాగంగా  యంగ్ టైగర్ ఎన్టీర్ కూడా తన కొత్త కారుకి ఫ్యాన్సీ నంబర్ కోసం ఏకంగా రూ.17 లక్షలు వెచ్చించాడు.


ఎన్టీఆర్ 9ని తన అదృష్ట సంఖ్య గా భావిస్తాడు. అందుకే తన కార్లకి 9999 వచ్చేలా చూసుకుంటాడు. తన తాతయ్య 9999 నంబరు గల కారును ఉపయోగించేవారనీ .. అలాగే తన తండ్రి కూడా అదే నంబర్  కారును వాడేవారనీ .. అందుకే ఆ నెంబర్ తనకి సెంటిమెంట్ అంటాడు యంగ్ టైగర్.  ఈ మధ్యే లంబోర్గిని కంపెనీకి చెందిన ఊరుస్‌ కారును ప్రత్యేకంగా ఇటలీ నుంచి తెప్పించుకున్నాడు.  కోట్లు వెచ్చించి కొన్న ఈ కారుకి  ఫ్యాన్సీ నెంబర్ కోసం వేలంలో ఎన్టీఆర్ పోటీపడ్డాడు. తాజాగా ఖైరతాబాద్ ఆర్టీఏ అధికారులు .. ఫ్యాన్సీ నెంబర్ల కోసం వేలం నిర్వహించారు. TS 09 FS 9999 అనే ఫ్యాన్సీ నెంబర్ ను దక్కించుకోవడానికి ఎన్టీఆర్ ఆసక్తిని చూపించాడు. ఈ ఫ్యాన్సీ నెంబర్ కోసం ఏకంగా రూ.17 లక్షలు చెల్లించాడు. ఇలా ఫ్యాన్సీ నెంబర్ల కోసం భారీ మొత్తం  చెల్లించే విషయంలో గతంలో తన పేరు మీదనే ఉన్న రికార్డును తానే బ్రేక్ చేసినట్టుగా చెబుతున్నారు. అదే రోజున మరో రెండు ఫ్యాన్సీ నెంబర్లను భారీ రేటుకు అమ్మడవలన ఆర్టీఏ అధికారులకు 45 లక్షల 52 వేల 921 రూపాయలు వచ్చాయట.  


Also Read: చిరంజీవి 43 ఏళ్లు సినీ జర్నీపై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్


మొత్తానికి  ఫ్యాన్సీ నంబర్లపై సెలబ్రెటీలకు ఉన్న ఆసక్తి రవాణాశాఖకు కాసుల వర్షం కురిపిస్తోంది.  టీఎస్‌09 ఎఫ్‌ఎస్‌ 9999 నంబరును రూ.17 లక్షలకు ఎన్టీఆర్ దక్కించుకున్నాడని చెప్పిన అధికారులు  కరోనా వచ్చిన తర్వాత ఇటీవల కాలంలో ఇదే రికార్డు ధర అంటున్నారు. 


Also Read: హేయ్.. మళ్లి ఏసేశాడు! మహేశ్ బాబు-సమంత 'దూకుడు'కి పదేళ్లు..


ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్  సినిమాల విషయానికి వస్తే..రాజమౌళితో దర్శకత్వంలో ప్రతిష్టాత్మక చిత్రం RRR “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పీరియాడిక్ మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్నాడు.  ఈ సినిమా ఇటీవలే క్లైమాక్స్ సంబంధించిన షూటింగ్ జరుపుకుంది.  ఇందులో  మరో ప్రధాన పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నాడు.  ఈ సినిమా ఆక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుందని గతంలో ప్రకటించినా.. తాజాగా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.


Also Read: ‘అనుభవించు రాజా’ టీజర్.. హథవిధీ! కోడిపుంజుకు కూడా కోరికలు పుట్టిస్తున్నాడు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి