బిగ్ బాస్ సీజన్ 5 లో హైలెట్స్ ఏంటని చెప్పుకుంటే గొడవలు, అరుపులు, కేకలు, ఆరోపణలు అని చెప్పుకోవాలేమో. ఎందుకంటే గడిచిన  సీజన్స్‌లో అప్పుడప్పుడు గొడవలు జరిగితే సీజన్ 5లో మాత్రం అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉంటోంది. ఎవ్వరూ తగ్గటం లేదు. నాలుగు గోడల మధ్య ఉన్నాం అనుకుంటున్నారు కానీ.. తెలుగు ప్రేక్షకులంతా చూస్తున్నారని మరిచిపోయి మరీ పోట్లాడుకుంటున్నారు. ఇప్పటికి రెండు వారాలు గడిచి మూడోవారంలో అడుగుపెట్టింది షో. మొదటివారం సిరి కెప్టెన్ కాగా, రెండో వారం విశ్వ కెప్టెన్ అయ్యాడు. ఇప్పుడు మూడో వారం కెప్టెన్సీ టాస్క్‌కు సంబంధించి ప్రోమో వచ్చింది.






బుధవారం కెప్టెన్సి పోటీదారుల కోసం బిగ్ బాస్ ఇచ్చిన హైదరాబాదీ అమ్మాయి - అమెరికా అబ్బాయి టాస్క్ లో యాంకర్ రవికి ఇచ్చిన సీక్రెట్ టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేశాడు. దీంతో కెప్టెన్ పోటీదారుడిగా నిలబడే అవకాశం వచ్చింది.  మ్యారేజ్ బ్రోకర్ క్యారెక్టర్ లో షణ్ముక్ జస్వంత్ మంచిమార్కులే కొట్టేశాడు. దీంతో రవి, జెస్సి, శ్వేతావర్మ, శ్రీరామచంద్ర కెప్టెన్సీ టాస్కుకి ఎంపికైనట్టు ప్రోమో చూస్తే అర్థమవుతోంది.


వీళ్లు నలుగురు స్విమ్మింగ్ పూల్ నుంచి కెప్టెన్ అనే ఇంగ్లీష్ లెటర్స్‌ని తీసుకుని పేర్చే విధంగా ఇచ్చిన ‘స్విమ్ జర స్విమ్’ టాస్క్‌లో పాల్గొన్నారు. వీరిలో ఎవరు కెప్టెన్ అవుతారో చూడాలి మరి. మరోవైపు బుధవారం జెస్సీతో టాస్క్ మధ్యలో జరిగిన సంభాషణలో సిరి హనుమంత్ గురించి ప్రస్తావించిన షణ్ముక్  సిరి సేఫ్ గేమ్ ఆడుతున్నట్లు అనిపిస్తోందని ముందులాగా తను యూనిక్‌గా ఉండట్లేదని తన పక్కన బెడ్ నుండి కూడా మారాలని ఉందని  చెప్పాడు.


తనకి కొన్ని రోజులపాటు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు జెస్సీతో షణ్ముక్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఇందుకు తగ్గట్టుగా షణ్ముక్ ప్రవర్తన కనిపిస్తోంది ప్రోమోలో. సిరిని దూరంగా పెట్టేందుకు షన్ను ప్రయత్నిస్తున్నట్లు ప్రోమోలో చూపించారు. అస్సలు ఎందుకు మాట్లాడటం లేదని సిరి అడిగితే.. ‘‘లోన్లీగా ఫీలవు’’ అని షన్ను సమాధానం ఇచ్చాడు. తనకు మాట్లాడే ఇంట్రెస్ట్ లేదని చెప్పమని జెస్సీతో తెలిపాడు. ‘‘నేనేమైనా గర్ల్ ఫ్రెండా ఇంట్రెస్ట్ లేదని చెప్పడానికి’’ అని సిరి జోక్ చేసింది. దీంతో షన్ను.. ‘‘నీతో స్నేహమే వద్దు’’ అని చెప్పడంతో సిరి అక్కడి నుంచి వెళ్లిపోయి.. ఒంటరిగా కూర్చొని భావోద్వేగానికి గురైంది.  


Also Read: చిరంజీవి 43 ఏళ్లు సినీ జర్నీపై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్


ఇక  ఈ వారం ప్రియా, ప్రియాంక, లహరి, మానస్, శ్రీరామ్ చంద్ర ఈ వారం నామినేషన్లలో ఉన్నారు. అయితే ఈ రేసులో మానస్ కు మంచి ఓటింగ్ ఉందని టాక్.  హౌస్‌లో అతని ప్రవర్తన, ఓపిక బుల్లితెర ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందట.  ఇందులో అతి తక్కువ ఓట్లతో లహరి వెనుకబడి ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఈ వారం నామినేషన్లలో ప్రియాకు, లహరికి జరిగిన గొడవ ప్రియాను కూడా డేంజర్ జోన్‌లోకి నెట్టే అవకాశం ఉందనే అభిప్రాయాలున్నాయి. మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. ఇప్పటికే మొదటివారం సరయు, రెండోవారం ఉమా ఎలిమినేట్ అయ్యారు. 


Also Read: హేయ్.. మళ్లి ఏసేశాడు! మహేశ్ బాబు-సమంత 'దూకుడు'కి పదేళ్లు..


Also Read: సెప్టెంబరు 24 శుక్రవారం థియేటర్లు, ఓటీటీల్లో సందడే సందడి..’లవ్ స్టోరీ’, ‘ఆకాశవాణి’, ‘పరిణయం’, ‘మోదీ బయోపిక్’, ‘మరో ప్రస్థానం’ అన్నీ రేపే విడుదల


Also Read: ‘అనుభవించు రాజా’ టీజర్.. హథవిధీ! కోడిపుంజుకు కూడా కోరికలు పుట్టిస్తున్నాడు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి