మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి పోటీకి దిగిన జీవితా రాజశేఖర్‌పై కమెడియన్ పృథ్వీరాజ్ ఫిర్యాదు చేశారు. సభ్యులను ఆమె ప్రలోభాలకు గురిచేస్తుందంటూ.. ఆయన ‘మా’ ఎన్నికల నిర్వాహకులను ఆశ్రయించారు. ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. జీవిత తనకు ఓటు వేస్తేనే లాభాలు ఉన్నాయంటూ ఆమె కొందరిని మభ్య పెడుతుందని పృథ్వీరాజ్ ఈ సందర్భంగా ఆరోపించారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్, మంజు విష్ణు మధ్య పచ్చ గడ్డి వేస్తుంటే భగ్గమంటోంది. గతంలో నరేష్‌పై ఆరోపణలు చేసిన హేమా కూడా ప్రకాష్ రాజ్ ప్యానెల్‌లోనే చేరారు. ఆమె తర్వాత జీవిత కూడా ఆ ప్యానెల్ వైపే మొగ్గు చూపారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్‌కు మెగా కుటుంబం మద్దతు ఉన్న నేపథ్యంలో ‘మా’ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. మంచు విష్ణు ప్యానెల్‌కు ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేష్ కూడా మద్దతు తెలిపారు. 

మంచు విష్ణు ప్యానెల్‌లో పృథ్వీరాజ్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో భాగంగా మంచు విష్ణు బరిలోకి దిగుతున్నాడు. ఈ ప్యానెల్ నుంచి పృథ్వీరాజ్ ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. విష్ణు ప్యానెల్ ప్రకటించిన కొద్ది క్షణాల్లోనే పృథ్వీరాజ్ రంగంలోకి దిగారు. జీవితపై అస్త్రాలు ఎక్కుపెట్టారు. 

మంచు విష్ణు ప్యానెల్‌లో ఉన్నది వీరే:

1. మంచు విష్ణు - అధ్యక్షుడు2. రఘుబాబు - జనరల్‌ సెక్రటరీ3. బాబు మోహన్‌ - ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌4. మాదాల రవి - వైస్‌ ప్రెసిడెంట్‌5. పృథ్వీరాజ్‌ బాలిరెడ్డి - వైస్‌ ప్రెసిడెంట్‌6. శివబాలాజీ - ట్రెజరర్7. కరాటే కల్యాణి -జాయింట్‌ సెక్రటరీ8. గౌతమ్‌ రాజు-జాయింట్‌ సెక్రటరీ 

ఇక మంచు విష్ణు ప్యానెల్ లో ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా పోటీ పడుతున్నవాళ్లు..అర్చన, అశోక్ కుమార్, గీతాసింగ్, హరినాథ్ బాబు, జయవాణి, మలక్ పేట్ శైలజ, మాణిక్, పూజిత, రాజేశ్వరి రెడ్డి, రేఖా, సంపూర్ణేష్ బాబు, శశాంక్, శివనారాయణ, శ్రీలక్ష్మి, శ్రీనివాసులు, స్వర్ణ మాధురి, విష్ణు బొప్పన, వడ్లపట్ల.  

ప్రకాష్ రాజ్ ప్యానెల్‌లో సభ్యులు వీరే: 

అధ్యక్షుడు: ప్రకాశ్‌రాజ్‌ట్రెజరర్‌ : నాగినీడుజాయింట్‌ సెక్రటరీ: అనితా చౌదరి, ఉత్తేజ్‌ఉపాధ్యక్షుడు: బెనర్జీ, హేమఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌: శ్రీకాంత్‌జనరల్‌ సెక్రటరీ: జీవితా రాజశేఖర్‌

ఎగ్జిక్యూటివ్ మెంబర్లు: అనసూయ, అజయ్, భూపాల్, బ్రహ్మాజీ, ప్రభాకర్, గోవింద రావు, ఖయూమ్, కౌశిక్, ప్రగతి, రమణా రెడ్డి, శివా రెడ్డి, సమీర్, సుడిగాలి సుధీర్, సుబ్బరాజు. డి, సురేష్ కొండేటి, తనీష్, టార్జాన్

Also Read: ‘నాగార్జున’ అనేసి నాలుక కరుచుకున్న సమంత.. ఆ తర్వాత ‘మామ’ అంటూ ట్వీట్, సామ్‌కు ఏమైంది?

Also Read: ప్రభుత్వం ఆధీనంలో సినిమా టికెట్లు.. లాభం ఎవరికీ? ఇక బెనిఫిట్ షోలు ఉండవా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.