గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం మరణించి సెప్టెంబర్ 25కు సరిగ్గా ఏడాది గడిచింది. ఆయన ప్రథమవర్ధంతి సందర్భంగా అభిమానులు, కుటుంబసభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పెరియపాళ్యం సమీపంలోని ఫాంహౌస్లో ఎస్పీబీ స్మారక మందిరం నిర్మిస్తోంది అతని కుటుంబం. ఈ మందిరం వద్ద శనివారం కుటుంబసభ్యులు, కొంతమంది అభిమానులు చేరుకుని నివాళులు అర్పించారు. నిజానికి అభిమానులు అధికంగానే అక్కడికి చేరుకున్నప్పటికీ పోలీసులు అందరినీ అనుమతించలేదు. దీంతో చాలా మంది బయటే ఉండిపోయారు. నిరాశ చెందిన అభిమానులకు ఎస్పీ బాలు కుమారుడు చరణ్ నచ్చజెప్పారు. ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ నాన్నగారి లేరంటే నమ్మలేకపోతున్నామని, ఆయన లోటు ఎవరూ పూడ్చ లేనిదని బాదపడ్డారు. స్మారక మందిర నిర్మాణాన్ని ఏడాదిలోపు పూర్తి చేస్తామని చెప్పారు. అలాగే నాన్నగారి పేరిట ఒక మ్యూజియమ్ థియేటర్ ను కూడా నిర్మించాలని అనుకుంటున్నామని, దానికి ప్రభుత్వ సాయం కోరతామని చెప్పారు. 


ఎస్పీబాలుకు తెలుగుతో, తమిళ, కన్నడ భాషల్లో కూడా వీరాభిమానులున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ కు చెందిన ఒక అభిమాని బాలు రాసిన పాటల్లో కొన్నింటినీ కాగితాలపై రాసుకుని, వాటిని మాలగా కట్టి మెడలో ధరించారు. వ్యవసాయ క్షేత్రానికి అరకిలోమీటరు దూరం నుంచి మోకాళ్లపై నడుచుకుని వచ్చి స్మారక మందిరం వద్ద నివాళులు అర్పించారు. 


బాలు గతేడాది కరోనా కారణంగా మరణించారు. 2020 ఆగస్టు 5న ఆయనకు కరోనా సోకింది. చికిత్స కోసం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. కొన్ని రోజులకే కరోనా నెగెటివ్ అని తేలింది. కానీ ఆ మహమ్మారి కారణంగా వచ్చి సైడ్ ఎపెక్టులతో ఆరోగ్యం విషమించింది. శ్వాసకోశ సమస్యలు ఏర్పడ్డాయి. ఎక్మో, వెంటిలేటర్ సాయంతో చికిత్స అందించారు. కానీ ఫలితం లేదు. 2020 సెప్టెంబర్ 25న ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు తమిళనాడులోని పెరియపాళ్యం సమీపంలో ఉన్న వ్యవసాయక్షేత్రంలోనే జరిగాయి. అభిమాన గాయకుడు ఇక లేరన్న వార్తను తమిళ, తెలుగు రాష్ట్రాలకు చెందిన అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 


Also read: మీకోసం బెస్ట్ ఫుడ్ ప్లాన్.. సూచిస్తున్నది ఓ బాలీవుడ్ సెలెబ్రిటీ న్యూట్రిషనిస్టు


Also read: సగ్గు బియ్యంతో బరువు తగ్గే ఛాన్స్.. అదొక్కటే కాదు మరెన్నో ప్రయోజనాలు


Also read: సాయిపల్లవిలాంటి డ్యాన్సర్ ను ఎప్పుడూ చూడలేదు... ఆమెకు ఎముకలున్నాయా? ట్వీట్ లో మహేష్ ప్రశంసలు