సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE Board Exams 2021-22) బోర్డ్ ఎగ్జామ్స్ విధానంలో ఇటీవల స్వల్ప మార్పులు చేసింది. కరోనా వ్యాప్తి తరువాత విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతున్న నేపథ్యంలో విద్యా సంవత్సరాన్ని రెండు టర్మ్‌లుగా విభజించి బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు సీబీఎస్ఈ బోర్డ్ ఇప్పటికే పేర్కొంది. ఈ క్రమంలో విద్యార్థులకు ఉపశమనం కలిగించే విషయాన్ని చెప్పింది. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు వసూలు చేయడం లేదని బోర్డ్ తెలిపింది. ఈ మేరకు పీటీఐ ఆ విషయాన్ని ట్వీట్ చేసింది.
కొవిడ్19 కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి విద్యార్థులకు బోర్డ్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడంలో ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు లేదని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 10, 2021 నాటికి టెన్త్ క్లాస్, పన్నెండో తరగతి విద్యార్థులకు సీబీఎస్ఈ (CBSE) మొదటి టర్మ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలో సీబీఎస్ఈ తన నిర్ణయాన్ని వెల్లడించింది.
Also Read: AP PGECET 2021: ఏపీ పీజీఈసెట్ హాల్‌టికెట్లు రిలీజ్ అయ్యాయి.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
కరోనా సోకడంతో తల్లిదండ్రులు ఇద్దర్నీ కోల్పోయిన సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్ రాయనున్న విద్యార్థులకు, లేక ఉన్న సింగిల్ పేరెంట్ చనిపోయిన వారికి, సంరక్షకుడు లేదా సంరక్షకురాలు చనిపోయిన విద్యార్థులకు 10వ తరగతి, 12వ తరగతి బోర్డు ఎగ్జామ్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి సీబీఎస్ఈ మినహాయింపు ఇచ్చింది. మరోవైపు పాఠశాలలు బోర్డు ఎగ్జామ్‌కు హాజరుకానున్న విద్యార్థుల జాబితాలను సీబీఎస్ఈకి ఇదివరకే పంపించింది. విద్యార్థులు సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా బోర్డ్ ఎగ్జామ్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. లేట్ ఫీజుతో అక్టోబర్ 9వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించింది బోర్డ్.
టర్మ్ 1లో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు, టర్మ్ 2 లో లాంగ్ ఆన్సర్ ప్రశ్నలతో పరీక్షలు నిర్వహించనున్నారు. రెండు టర్మ్స్‌లోనూ కేస్-బేస్డ్ ప్రశ్నలు వివిధ ఫార్మాట్లలో ఉంటాయి. టర్మ్ 1 ఎగ్జామ్ అక్టోబర్‌లో, టర్మ్ 2 ఎగ్జామ్స్ వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నెలలో నిర్వహించడానికి సీబీఎస్ఈ బోర్డ్ షెడ్యూల్ చేసింది.