జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ శనివారం రాత్రి రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీశంగా మారిన సంగతి తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వేధిస్తోందని వ్యాఖ్యలు చేశారు. తెలుగు పరిశ్రమ కన్నెత్తి చూస్తే కాలిపోతారంటూ ఘాటుగా మాట్లాడారు. అవసరమైతే తన సినిమాలు ఆపుకోవాలని, తెలుగు చిత్రాలన్నింటినీ వదిలేయాలని అన్నారు. అయితే, ఇలా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో ఘాటుగా స్పందించారు. పవన్ కల్యాణ్‌ను ఎద్దేవా చేస్తూ మాట్లాడారు.
వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సీఎం జగన్ గురించి మాట్లాడితే తాటతీస్తామని హెచ్చరించారు. చిరంజీవి, నాగార్జున వంటివారు సినిమా థియేటర్లు, టికెట్ల ధరల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఓ ప్రతిపాదన చేశారని చెప్పారు. ప్రస్తుతం ఈ అంశాలపై చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక పనికిమాలిన స్టార్ అని ఎద్దేవా చేశారు. అసలు పవన్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని, ఆయన పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయాడని గుర్తు చేశారు. పంచాయతీ, మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో కూడా జనసేన దారుణ పరాభవం చవి చూసిందని అన్నారు.
Also Read: మణికొండలో గల్లంతైన వ్యక్తి ఎవరో తెలిసింది.. 12 గంటల నుంచి నాలాలు, చెరువుల్లో ఆయన కోసం గాలింపు
‘మా’ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పవన్ మాట్లాడుతున్నట్లుగా ఉందని మంత్రి వెల్లంపల్లి విమర్శించారు. సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో రాజకీయాలు ఎందుకు మాట్లాడాడని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పావలా పవన్ కళ్యాణ్ వలన ఏమవుతుందని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ అమ్ముడు పోయే వ్యక్తి అని, ఎవరు డబ్బులు ఇస్తే వారికి ప్రచారం చేస్తాడంటూ తీవ్ర పదజాలం ఉపయోగించారు.
Also Read: భార్య గొంతు కోసేసిన భర్త, తర్వాత చెయ్యి కట్ చేసుకొని.. పెళ్లైన నెలరోజులకే దారుణం
ప్రకాశ్ రాజ్ యాక్టింగ్‌లో పావు వంతు కూడా లేదు: మంత్రి
సామాన్యులకు భారం తగ్గించేందుకు ప్రభుత్వం టిక్కెట్లు అమ్మితే తప్పేంటని మంత్రి వెల్లంపల్లి ప్రశ్నించారు. పవన్ రెమ్యునరేషన్ ఎందుకు తగ్గించుకోరని ప్రశ్నించారు. రాజకీయంగా ఎదగలేని నిరాశతో పవన్ మాట్లాడుతున్నారని మంత్రి చెప్పుకొచ్చారు. ప్రజలను దోచుకొనేందుకు పవన్ మద్దతిస్తున్నారంటూ మండి పడ్డారు. చిరంజీవి లేకపోతే పవన్ లేరని మంత్రి వ్యాఖ్యానించారు. సినీ పరిశ్రమ నుంచి చిరంజీవితో పాటుగా మరి కొందరు పెద్దలు అడిగితేనే ప్రభుత్వం ఆన్ లైన్ టిక్కెట్ల ప్రతిపాదన పైన చర్చలు చేస్తోందని మంత్రి వివరించారు. దీని ద్వారా పవన్ కు వచ్చే నష్టం ఏంటని నిలదీసారు. సినిమా పేరు చెప్పుకొని బతుకుతున్నావని..ప్రజలకు టిక్కెట్ ధరలు తగ్గకూడదని చెప్పే పవన్.. ఇక ప్రజలకు ఏం సేవ చేస్తావంటూ వెల్లంపల్లి ప్రశ్నించారు. వకీల్ సాబ్‌లో ప్రకాశ్ రాజ్ చేసిన నటనలో పావు వంతు కూడా పవన్ కల్యాణ్ యాక్టింగ్ చేయలేకపోయారంటూ ఎద్దేవా చేశారు.