హైదరాబాద్‌ నగరంలో శనివారం రాత్రి బీభత్సమైన వర్షం చాలాసేపు కురిసిన సంగతి తెలిసిందే. ఈ అతి భారీ వర్షానికి హైదరాబాద్‌లో చాలా ప్రాంతాల్లో వరద నీరు ముంచెత్తింది. భూగర్భ నాలాలు నిండిపోగా.. మ్యాన్ హోల్స్ పొంగిపొర్లాయి. రోడ్లపై విపరీతంగా నీరు చేరడంతో నాలాలకు నీరు పోటెత్తింది. దీంతో మణికొండలో ఓ వ్యక్తి డ్రైనేజీ పైపులైన్‌ కోసం తవ్విన గుంతలో పడి గల్లంతయ్యాడు. గల్లంతైన ఈ వ్యక్తిని గోపిశెట్టి రజనీకాంత్‌ అనే 42 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు. ఘటనా స్థలానికి 50 మీటర్ల దూరంలోనే అతడి ఇల్లు ఉంది. షాద్‌నగర్‌లోని నోవా గ్రీన్‌ అనే కంపెనీలో ఆయన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. శనివారం రాత్రి 9 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చిన రజనీకాంత్‌.. నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ గుంతలో పడి గల్లంతయ్యారు. వర్షపు నీటితో నిండి దారి కనిపించకపోవడంతో గుంతలో పడ్డారు.


సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ అధికారులు విపత్తు రక్షక దళం (డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్-డీఆర్ఎఫ్) సాయంతో అతని కోసం 10 గంటలుగా గాలిస్తున్నారు. డీఆర్‌ఎఫ్‌ బృందాలు రాత్రే రంగంలోకి దిగి గాలింపు చేపట్టాయి. తూములు వెళ్లి కలిసే చోట కూడా ఆ వ్యక్తి కోసం చర్యలు చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతానికి మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న నెక్నాంపూర్ చెరువు వద్ద మరో బృందం వెతుకుతోంది. వరద నీటి తాకిడి ఎక్కువగా ఉండడంతో అతడు చెరువు వరకూ వెళ్లే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మణికొండలో ఘటనాస్థలాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు.


Also Read: Tollywood Vs Jagan : టాలీవుడ్‌పై ఏపీ ప్రభుత్వం పగ సాధిస్తోందా ? పవన్ కల్యాణ్ వ్యాఖ్యల వెనుక అసలు కారణం ఏమిటి ?


తెలంగాణలోనూ గులాబ్ తుపాను ప్రభావం
తెలంగాణలోనూ గులాబ్‌ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. దీనికి గులాబ్‌ అని పేరు పెట్టారు. ఇది కళింగపట్నానికి ఈశాన్య దిశలో 440 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఆదివారం సాయంత్రం గోపాల్‌పుర్‌-కళింగపట్నం మధ్య తీరం దాటనుందని వాతావరణశాఖ ప్రకటించింది. 


ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాకు ‘ఆరెంజ్‌’ హెచ్చరికలను జారీ చేసింది. అందులో ‘తుపాను ప్రభావం ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం ప్రాంతాలపై ఎక్కువగా ఉంటుంది. మిగిలిన కోస్తా జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీర ప్రాంతాల్లో గంటకు 75 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వెల్లడించారు. రాగల 24 గంటల్లో ఒడిశా, ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, దక్షిణ కోస్తా జిల్లాలతోపాటు తెలంగాణ, విదర్భ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు.తుపాను ప్రభావంతో తెలంగాణలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. 


Also Read: బీడీ కోసం గొడవ.. ప్రత్యర్థిని చంపుదామని కత్తి తీసుకెళ్లిన వ్యక్తి, చివరికి ట్విస్ట్ మామూలుగా లేదు!


శనివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పలు చోట్ల భారీ వానలు కురిశాయని తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం మామకన్నులో 12.3 పోచంపల్లి (కరీంనగర్​)లో 6.3, కూనారం (పెద్దపల్లి)లో 6, ఆవునూరు (రాజన్న సిరిసిల్ల జిల్లా)లో 6, సంగారెడ్డిలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయినట్లు అధికారులు చెప్పారు. ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో సముద్రపు అలల తీవ్రత పెరిగే అవకాశముంది. తుపాను తీరాన్ని దాటే సమయంలో శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం ఆ పరిసర ప్రాంతాల్లో కచ్చా ఇళ్లు, పూరిళ్లు దెబ్బతినే ప్రమాదముంది. లోతట్టు ప్రాంతాల్లోకి సముద్ర నీరు చొచ్చుకొచ్చే ప్రమాదముంది’ అని హెచ్చరించింది.


Also Read: సినిమా మేం తీస్తే, టికెట్లు మీరు అమ్ముతారా... సిని ఇండస్ట్రీ జోలికి వస్తే ఊరుకోను .. ఏపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి