భర్త చేసిన పని సహించలేని ఓ మహిళా సర్పంచి ఆత్మహత్యకు యత్నించింది. చివరికి చికిత్స పొందుతూ ఆసుపత్రులతో చావు బతుకుల మధ్య పోరాడుతూ తనువు చాలించింది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన మహిళా సర్పంచ్ జడ్చర్ల మండలంలోని నసురుల్లాబాద్ తండా అనే గ్రామానికి ఆమె సర్పంచ్‌ గా ఉన్నారు. ఓ మహిళా సర్పంచ్ ఆత్మహత్య చేసుకోవడం జిల్లాలో కలకలం రేపింది.


భర్త మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడనే కారణంతో సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎంత చెప్పినా వినకపోవడంతో ఆమె చనిపోవాలని భావించినట్లుగా గ్రామస్థులు తెలిపారు. ఈ విషయంలో కొద్ది రోజులుగా వారు తరచూ గొడవలు పడేవారని తెలిపారు. స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం నసురుల్లాబాద్‌ తండాకు చెందిన శ్రీనివాస్‌ నాయక్‌ అనే వ్యక్తి, మాచారం తండాకు చెందిన పాల్‌ త్యావత్‌ సిరి అపూ 30 ఏళ్ల మహిళకి 12 సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. వీరికి కొన్నాళ్ల క్రితమే ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. 


Also Read: వరదలో వ్యక్తి గల్లంతు.. 10 గంటల నుంచి గాలింపు, తుపాను ఎఫెక్ట్‌ తెలంగాణపై కూడా..


రెండేళ్ల క్రితం కొత్తగా ఏర్పడిన నసురుల్లాబాద్‌ తండా నుంచి 2019 జనవరి ఎన్నికల్లో పాల్ త్యావత్ సిరి ఏకగ్రీవంగా సర్పంచిగా ఎన్నికయ్యారు. కొద్ది నెలల కిందట ఆమె భర్త అయిన శ్రీనివాస్‌ నాయక్‌ అదే తండాకు చెందిన ఓ వివాహితను తీసుకెళ్లిపోయి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ నెల 14న ఆ మహిళతో కలిసి సొంత గ్రామం అయిన నసురుల్లాబాద్ తండాకు వచ్చాడు. దీంతో భార్య తన భర్తతో గొడవ పడింది. అయినా భర్త శ్రీనివాస్ నాయక్ వినకపోవడంతో విరక్తి చెందిపోయి.. ఆత్మహత్యకు పాల్పడింది. ఇందుకోసం ఇంట్లోనే ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.


Also Read: ఉత్తరాంధ్రకు 'గులాబ్' తుపాను ముప్పు.. తెలంగాణలోనూ భారీ వర్షాలు 


వారు హైదరాబాద్‌ తీసుకెళ్లాలని సూచించడంతో గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడే చికిత్స పొందుతూ మహిళా సర్పంచ్ సిరి శనివారం ఉదయం మృతి చెందింది. ఆమె సోదరుడు శంకర్‌ నాయక్‌ ఫిర్యాదు మేరకు ఆత్మహత్యకు ప్రేరేపించిన భర్త శ్రీనివాస్‌ నాయక్‌పై కేసు పెట్టినట్లుగా పోలీసులు వెల్లడించారు. భర్త శ్రీనివాస్ నాయక్‌ను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.


Also Read: బీడీ కోసం గొడవ.. ప్రత్యర్థిని చంపుదామని కత్తి తీసుకెళ్లిన వ్యక్తి, చివరికి ట్విస్ట్ మామూలుగా లేదు!


Also Read: సినిమా మేం తీస్తే, టికెట్లు మీరు అమ్ముతారా... సిని ఇండస్ట్రీ జోలికి వస్తే ఊరుకోను .. ఏపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి