హైదరాబాద్‌‌లో దారుణమైన హత్య జరిగింది. కొత్తగా పెళ్లైన దంపతుల్లో భర్త భార్యను హత్య చేయగా.. అనంతరం అతను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గొంతు కోసి ఆమెను హత్య చేయడం గమనించదగ్గ విషయం. హైదరాబాద్ బాచుపల్లి పరిధిలోని ప్రగతి నగర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. పెళ్లైన నెల రోజులకే భార్యపై అనుమానం పెంచుకున్న భర్త, ఆమెను కిరాతకంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. అనంతరం అతను కూడా ఆత్మహత్యకు యత్నించాడు. శనివారం అర్ధరాత్రి వేళ ఈ ఘటన చోటుచేసుకుంది.  


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కిరణ్, సుధారాణి భార్యాభర్తలు. వీరికి నెల రోజుల క్రితమే వివాహం జరిగింది. భార్యపై అనుమానంతో కిరణ్, ఆమె గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం చేయి కోసుకుని ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుధారాణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కిరణ్ చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.


Also Read: Vellampalli: ‘జగన్ గురించి మాట్లాడితే తాటతీస్తాం, పనికిమాలిన స్టార్‌..’ పవన్‌పై వెల్లంపల్లి సంచలన వ్యాఖ్యలు


ఇంకో హత్య కేసులో ఐదుగురు అరెస్టు
మరోవైపు, హైదరాబాద్‌లో ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన కేసులో ఐదుగురు నిందితులను చాంద్రాయణ గుట్ట పోలీసులు అరెస్ట్‌ చేశారు. హత్యకు వాడిన కత్తితో పాటు ఇతర వస్తువులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. శనివారం చాంద్రాయణ గుట్ట పోలీస్‌ స్టేషన్‌లో దక్షిణ మండల డీసీపీ గజరావు భూపాల్‌ వివరాలు వెల్లడించారు. చిల్లర దొంగతనాలు చేసుకొనే షేక్‌ ఇస్మాయిల్‌ (26), మహ్మద్‌ తాజుద్దీన్‌ (21), షేక్‌ ఉస్మాన్‌ (20), మహ్మద్‌ సాహిల్‌(20), మహ్మద్‌ రహేన్‌ (19) మహ్మద్‌ ఆసిఫ్‌ (20)పై పోలీస్‌ స్టేషన్లలో హత్య కేసులతో పాటు ఆయుధాలు కలిగి ఉన్న కేసులు మొత్తం 11 వరకూ ఉన్నాయి. 


Also Read: పట్టాలు తప్పిన రైలు, ఒకరు మృతి.. 50 మందికి పైగా గాయాలు.. వీడియో


ఈ నెల 20న అందరూ కలిసి పార్థివాడ బస్తీలో ఓ ఇంట్లో మందు పార్టీ చేసుకున్నారు. మత్తులో షేక్‌ ఇస్మాయిల్‌ ఆసిఫ్‌తో గొడవకు దిగాడు. అందరూ ఆటో ఎక్కారు. ఈ క్రమంలో ఆసిఫ్‌ను గట్టిగా పట్టుకోగా, ఇస్మాయిల్‌ కత్తితో రెండు సార్లు పొడిచాడు. ఆటోలో తిరుగుతూ బండ్లగూడలోని ఓ కాలేజీ సమీపంలో ఎవరూ లేని ప్రాంతంలో శవాన్ని పడేశారు. ప్రాణం పోలేదని గమనించి.. మరోసారి కత్తితో పది పోట్లు పొడిచి, గొంతుకోసి చంపేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన చంద్రాయణ గుట్ట పోలీసులు శనివారం నిందితులను అదుపులోకి తీసుకున్నారు.


Also Read: మణికొండలో గల్లంతైన వ్యక్తి ఎవరో తెలిసింది.. 12 గంటల నుంచి నాలాలు, చెరువుల్లో ఆయన కోసం గాలింపు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి