అమెరికాలోని మోంటానా రాష్ట్రంలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మరణించగా.. మొత్తం 50 మంది గాయపడ్డారని స్థానిక మీడియా వెల్లడించింది. ప్యాసింజర్ రైళ్లను నడిపే రైల్వే సంస్థ ఆంత్రక్‌కు చెందిన రైలుకు ఈ ప్రమాదం జరిగింది. రైలు ప్రమాదానికి గురైన వెంటనే స్థానిక అధికారుల సాయంతో క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించామని, రైలులో ఉన్న మిగతా ప్రయాణికులను కూడా బయటికి తీసుకొచ్చామని ఆంత్రక్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రమాద సమయంలో రైలులో 147 మంది ప్రయాణికులు, 13 మంది సిబ్బంది ఉన్నారని సంస్థ తెలిపింది.
ఉత్తర మాంటానా రాష్ట్రంలోని జోప్లిన్ ప్రాంతంలో శనివారం సాయత్రం 4 గంటల సమయంలో రైలు పట్టాలు తప్పిందని ఆంత్రక్ సంస్థ వెల్లడించింది. మొత్తం 5 బోగీలు పట్టాలనుంచి బయటకు వచ్చినట్లు తెలిపింది.
Also Read: 'తీరు మార్చుకోకపోతే ఇక అంతే'.. ఐరాస పనితీరుపై మోదీ చురకలు
ఈ ప్రమాద ఘటన అనంతరం బయటకు వచ్చిన ప్రయాణికులు తమ లగేజీలు, బ్యాగులతో పట్టాల పక్కనే వేచి చూస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. మోంటానా డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కోఆర్డినేటర్ ప్రముఖ పత్రిక న్యూయార్క్ టైమ్స్‌కు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒకరి కన్నా ఎక్కువ ప్రాణ నష్టం జరిగినట్లుగా చెప్పారు. 50 మంది ప్రయాణికులు గాయపడినట్లుగా అంచనా వేశారు.
Also Read: అఫ్గాన్ ప్రజలకు భరోసా.. పాకిస్థాన్‌కు పరోక్ష హెచ్చరిక.. మోదీ స్పీచ్ హైలైట్స్ ఇవే